33.2 C
Hyderabad
May 4, 2024 00: 22 AM
Slider విజయనగరం

దండుమార‌మ్మ ను నిలువునా దోచేసిన దంగలు

#dandumaremmatemple

దేన్నీ వ‌ద‌ల‌ని  దొంగ‌లు..చివ‌ర‌కు విగ్ర‌హానికి ఉన్నవెండి క‌ళ్లు కూడా చోరీ…!

వార్త‌లో  హెడ్డింగ్ చదివారుగ‌….ఇదీ మేట‌ర్….రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం  వ‌హించిన విక్ర‌మార్కుడు  సినిమాలో రెండో హీరో అత్తలి స‌త్తిబాబు..అన్న డైలాగ్ ను ఒక‌సారి వ‌ల్లె వేసుకుంటే  స‌రి. విజ‌య‌నగ‌ర‌రం జిల్లా కేంద్రంలో కంటోన్మెంట్ ప్రాంతం..పోలీసు శాఖ కు చెందిన యావన్మంది అధికారులు.. అంటే కానిస్టేబుల్ నుంచీ సీఐలు డీఎస్పీ లు..ఆఖరికి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆఫీసు ఉన్న ప్రాంతం.

అక్కడే చాలా ఏండ్ల క్రితం… పోలీసులు తమ ఇష్ఠదైవంగా భావించి న శ్రీశ్రీశ్రీ దండుమారమ్మ కోవెలను స్వయంగా నిర్మించి వూపద ప నైవేద్యాలతో నిత్యం కొలిచే పరమపవిత్రమైన దేవాలయం. ఆ దేవాలయం లో ఈ నెల 24 ఉదయం దొంగతనం జరిగి..ఆలయం లో అమ్మవారి విగ్రహంపై ఉన్న ఆభరణాలతో పాటు… హుండీ సొమ్ము ను కూడా దొంగలు దోచుకుపోయారు.

విషయం అదే సమాచారం అందుకున్న వన్ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఈ చోరీలో సత్యం న్యూస్. నెట్.. స్వయంగా పరిశోధించి.. కొన్ని ఆసక్తి కరమైన అంశాలను వెలుగులో కి తెచ్చే యత్నం చేసింది. అవేంటంటే.

నగరం మొత్తం సీసీ కెమెరా లున్న..టెంపుల్ లేవు.

అక్కడక్కడ ఉన్న సరిగ్గా పని చేయవు.

ఆలయ నిర్వహణ మొత్తం ఆర్మర్డ్ రిజర్వు ఆధ్వర్యంలో.

ప్రతీఏటా అమ్మవారి వార్షిక ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్న పోలీసు శాఖ.

ఉగాది ,దసరా, ఉత్సవాలు అత్యంత వైభవంగా.

ఆలయానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వని భద్రత.

అసలు దొంగతనం జరగదన్న ధీమా తో ఆలయ నిర్వాహకులు.

స్వయంగా దండుమారమ్మ టెంపుల్ లో చోరీ జరగడంతో ఎస్పీ అలెర్ట్.

ఆర్మర్డ్ రిజర్వ్ అడ్మిన్ ఆధ్వర్యంలో టెంపుల్ నిర్వహణ.

తమ ఇలవేల్పుగా దండుమారమ్మ ను కొలుస్తున్న పోలీసు శాఖ సిబ్బంది.

1998 లో అప్పటి ఎస్పీ మాదిరెడ్డి ప్రతాప్ ఆధ్వర్యంలో నే స్ధాపించిన టెంపుల్.

శాఖకు కూతవేటు దూరంలో చోరీ జరగడం తో జనాలు బెంబేలు.

అనునిత్యం టెంపుల్ వద్ద గస్తీపై రాత్రి పూట పోలీసులు కాపలా.

అయిన పోలీసులకే పట్టూకోండి చూద్దాం అంటూ సవాల్.

మొత్తానికి.. జిల్లా ఎస్పీ ఆఫీసుకు కూతవేటు దూరంలో అదీ పోలీసులు తమ ఇష్ఠదైవంగా వారిచే రోజు వారి పూజలందుకుంటున్న శ్రీశ్రీ శ్రీ దండుమారమ్మ టెంపుల్ దొంగతనం జరగడం… పోలీస్ శాఖ అందునా బాస్ అయినా ఎస్పీ సీరియల్ గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. తక్షణం… నిందితులను పట్టుకునేందుకు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీలను పెట్టి జిల్లా అంతటా నిందుతులకై గాలింపు చర్యలు ప్రారంభించారు కూడా.

ఏది ఏమైనా జిల్లా ఎస్పీ గా దీపికా బాధ్యతలు తీసుకుని ఏడాదవు తున్న సందర్భంలో.. పోలీసు శాఖ ..అదీ ఆ పరిసర ప్రాంతంలో ఉండే దండుమారమ్మ టెంపుల్ లో చోరీలో జరగడంతో సీరియస్ గా తీసుకుప్పట్ల సమాచారం. తక్షణమే సీసీఎస్ పోలీసులు రంగంలో దిగాలని ఆదేశించడంతో ..మొత్తం పోలీసు శాఖే అలెర్ట్ అయ్యింది.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిపై ఐటి దాడులు

Satyam NEWS

ధాన్యం కొనరు కానీ ఎం‌ఎల్‌ఏ లను కొంటారట

Murali Krishna

తెలంగాణలో క‌రోనా 596 కేసులు, 3 మరణాలు

Sub Editor

Leave a Comment