26.7 C
Hyderabad
May 3, 2024 07: 37 AM
Slider విజయనగరం

మూడు నెలల్లో బైరెడ్డి పేట చోరీ కేసు నిందితుడు పట్టివేత..!

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించిన చీపురుపల్లి లోగతేడాది,ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన దొంగ తనం కేసులో సొత్తుతో పాటు నిందితుడిని పట్టుకున్నారు… చీపురుపల్లి సబ్ డివిజన్ పోలీసులు. ఈ మేరకు చీపురు పల్లి పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ చక్రవర్తి ఈ విషయాన్ని తెలియజేసారు.

చీపురుపల్లి మండల పరిధిలో గత ఏడాది 2022 సం.లో పత్తికాయవలస లో జరిగిన దొంగతనం కేసులో నమోదు అయిన క్రైమ్ 140/2023 యూఎస్ 457, 380 ఐపీఎస్ ఈ ఏడాది ఏప్రిల్ 26 రాత్రి బైరెడ్డి పేట గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో నమోదు అయిన క్రైమ్ నెంబర్ 72/2023 యూఎస్ 457, 380 ఐపీసీ కేసుల్లో చీపురుపల్లి పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసుల్లో పోలీసులకు రాబడిన సమాచారంపై నిందితుడు అయిన లావేరు మండలం అదపాక కి చెందిన కుప్పిలి ఆదినారాయణ @ ముద్దుగాడు అను నిందుతుడుని చీపురుపల్లి మండలం పత్తికాయవలస గ్రామ జంక్షన్ దగ్గరలో గల ఫుడ్ కోర్ట్ వద్ద చీపురుపల్లి ఎస్ఐ సన్యాసి నాయుడు మరియు సిబ్బంది పట్టుకొని, అతని వద్ద నుండి రెండు దొంగతనం కేసుల్లో రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, 80 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకొని, నిండుతుడిని రిమాండుకు తరలించారు.

ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన చీపురుపల్లి ఎస్సై ఏ.సన్యాసి నాయుడు మరియు హెడ్ కానిస్టేబుల్స్ వేణు నాయుడు, వెంకటరమణ మరియు కానిస్టేబుల్స్ భాను, గోవింద్, రమణ, రాంబాబు, జగదీశ్ మరియు హోం గార్డ్ రమణ లను చీపురుపల్లి డిఎస్పీ చక్రవర్తి, సీఐ జి.సంజీవరావు లు అభినందించారు..

Related posts

సినీ నటుడు మోహన్‌బాబు ఇంటి వద్ద కలకలం

Satyam NEWS

వివేకా హత్య నిందితుల నుంచి జగన్ సోదరికి ప్రాణహాని

Satyam NEWS

విజయనగరం జిల్లా అధికారుల‌కు క‌లెక్ట‌ర్ సూర్యకుమారి ప్ర‌త్యేక అభినంద‌న‌లు..!

Satyam NEWS

Leave a Comment