33.2 C
Hyderabad
May 15, 2024 12: 55 PM
Slider ప్రకాశం

కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు

#SP Malika Garg

కోడిపందాలు, జూదాలు తదితర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ హెచ్చరించారు. జూద క్రీడలు వద్దు – సంప్రదాయ క్రీడలే ముద్దు అని జిల్లా ఎస్పీ తెలిపారు. కోడి పందెం, జూదం మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ – 100కు లేదా పోలీసు వాట్సాప్ నెంబర్ 9121102266 కు తెలియచేయాలని ఎస్పీ కోరారు.

సంక్రాంతి పండగను పురస్కరించుకొని జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, శివార్లు మరియు ఇతర ప్రాంతాల్లో కోడి పందాలు, జూదాలు మరియు గుండాట నిర్వహించడం నిషేధమని, ఎవరైనా కోడి పందేలు ఆడినా, ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాంప్రదాయం క్రీడలు అయిన కబడ్డి, కోకో, బ్యాట్మెంటన్ లతో పాటుగా వాలీబాల్, ఫుట్ బాల్, క్రికెట్ మొదలగు క్రీడలు నిర్వహించుకోవాలని, పండగలను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు. జిల్లాలో కోడి పందేలు, జూదాలు కట్టడికి పోలీసు అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని, కోడి పందేలు,పేకాట స్థావరాలను గుర్తించి నిఘా పెట్టాలన్నారు.

Related posts

విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోండి

Sub Editor 2

సప్తగిరి మాసపత్రికతో బాటు ‘రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు’

Satyam NEWS

భారీ వర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

Satyam NEWS

Leave a Comment