38.2 C
Hyderabad
May 5, 2024 20: 06 PM
Slider క్రీడలు

నాలుగేళ్ల తర్వాత ఉప్పల్‌ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్‌

#president Azharuddin

నాలుగేళ్ల తర్వాత ఉప్పల్‌ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్‌ వన్డే మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈనెల 18న ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరుగుతుందని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) అధ్యక్షుడు అజహరుద్దీన్‌ ప్రకటించారు. ఈ మ్యాచ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు వెల్లడించారు. ఈనెల 13 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు జరుగుతాయన్నారు.

ఆఫ్‌లైన్‌ టికెట్లు అమ్మడం లేదని.. ఆన్‌లైన్‌లో పేటీఎంలో మాత్రమే విక్రయిస్తామని అజహరుద్దీన్‌ తెలిపారు. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియాల్లో ఈ నెల 15 నుంచి 18 వరకు ఉదయం 10 నుంచి 3 గంటల వరకు ఫిజికల్‌ టికెట్లు తీసుకోవాలని సూచించారు. జనవరి 14న న్యూజిలాండ్‌ జట్టు నగరానికి వస్తుందని, 15న ప్రాక్టీసు ఉంటుందని వెల్లడించారు. భారత జట్టు 16న హైదరాబాద్‌ చేరుకుంటుందన్నారు. 17న ఇరు జట్లు ప్రాక్టీస్‌ చేస్తాయని అజహరుద్దీన్‌ వివరించారు.

Related posts

దయచేసి మనిషికి మూడు చెట్లు నాటండి

Satyam NEWS

వైఎస్ నిర్ణయాన్ని తప్పు పడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి

Satyam NEWS

తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య డైరీ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment