తమ భూమిపై వేరేవారికి పాస్ బుక్కులు మంజూరు చేసిన తహసీల్దార్ చర్యకు నిరసనగా ఒక రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో నేడు ఈ సంఘటన జరిగింది. వేనాటి బాబు రెడ్డికి మూడు ఎకరాల 40 సెంట్ల భూమి ఉంది. అదే విధంగా పిట్ల కుమార్ కు 80 సెంట్లు ఉంది.
అయితే ఈ భూములపై వేరే వారికి పేరుతో తహసీల్దార్ పాస్ బుక్ ఇచ్చేశారు. అధికారులకు తమ సమస్యను ఎన్నిసార్లు చెప్పుకున్నా లాభం లేకపోవడంతో తనువు చాలించాలని ఇద్దరూ భావించారు. వేనాటి బాబు రెడ్డి కిరోసిన్ బాటిల్ తీసుకుని అక్కడకు వచ్చాడు. ఆర్డీఓ సరోజిని ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.