28.7 C
Hyderabad
May 6, 2024 07: 16 AM
Slider ముఖ్యంశాలు

మే 31 వరకూ స్కూళ్లకు వేసవి సెలవులు

#SabitaIndrareddy

ఏప్రిల్ 27 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు  రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారని మంత్రి తెలిపారు. 

కరోనా విస్తరించిన నేపథ్యంలో ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు మంత్రి తెలిపారు.

పాఠశాలలు, జూనియర్ కళాశాలలను తరువాత ఎప్పుడు తెరిచేది కోవిడ్ – 19 పరిస్థితిని అనుసరించి జూన్ 1న  ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినంగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Related posts

గోదావరి జిల్లాల్లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఎవర్ గ్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ చిత్రం

Satyam NEWS

T-shirt discussion: వణికించే చలిలో కూడా టీషర్ట్ తోనే రాహుల్

Satyam NEWS

రాజ్యాంగంలో అంబేద్కర్ ఆనాడే పొందుపరిచారు

Satyam NEWS

Leave a Comment