38.2 C
Hyderabad
May 3, 2024 22: 59 PM
Slider జాతీయం

రైట్స్:ష‌హీన్‌బాగ్ నిర‌స‌న‌కారుల‌తో సుప్రీం చ‌ర్చ‌లు

supreme court discussed with shahinbag protesters

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఢిల్లీలోని ష‌హీన్‌బాగ్‌లో గ‌త రెండు నెల‌ల నుంచి ఆందోళ‌న‌కారులు ధ‌ర్నా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న వ‌ల్ల ఢిల్లీలో రాక‌పోక‌లు ఇబ్బందిగా మారాయి.  ఆందోళ‌న‌కారులు రోడ్డుపైన టెంట్లు వేసుకోవ‌డం వ‌ల్ల ట్రాఫిక్ జామ‌వుతున్న‌ది.  స్థానికంగా వ్యాపారాలు కూడా దెబ్బ‌తింటున్నాయి. అయితే ఈ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు ఓ పిటిష‌న్‌పై వాదోప‌వాదాలు విన్న‌ది. 

నిర‌స‌న అనేది ప్రాథ‌మిక హక్కు అని, కానీ ఆందోళ‌న‌కారులు త‌మ ప్ర‌ద‌ర్శ‌న స్థ‌లాన్ని మ‌రో చోటుకు మార్చే వీలు లేదా అని కోర్టు ప్ర‌భుత్వాన్ని అడిగింది.  నిర‌స‌న‌కారుల‌ను మ‌రో చోటుకు పంపేందుకు ఇద్ద‌రు సీనియ‌ర్ న్యాయ‌వాదుల‌ను మ‌ధ్య‌వ‌ర్తిగా నియ‌మిస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు చెప్పింది.  అడ్వ‌కేట్లు సంజ‌య్ హెగ్డే, సాధ‌నా రామ‌చంద్ర‌న్‌లు.. ఆందోళ‌న‌కారుల‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌నున్నారు.  నిర‌స‌న‌కారుల‌ను మ‌రో ప్ర‌దేశానికి త‌ర‌లించేందుకు ఆ ఇద్దరూ వారిని ఒప్పించ‌నున్నారు.

Related posts

కామారెడ్డిలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభం

Satyam NEWS

సం‘కుల’ సమరం: మెయిన్ పురిలో హోరాహోరీ

Satyam NEWS

అక్కా, నిను పట్టించుకోని సమాజాన్ని క్షమించు

Satyam NEWS

Leave a Comment