29.7 C
Hyderabad
May 4, 2024 06: 21 AM
Slider

అప్రమత్తతతో పకడ్బందీగా పరీక్షల విధులు నిర్వర్తించాలి

10thexams

అమ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం డ్యాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి వార్షిక పరీక్షా కేంద్రాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌ పి. ఉదయ్ కుమార్ నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు.

విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? లేదా? అన్నది సి.సి కెమెరా ఫుటేజీల పరిశీలన ద్వారా నిర్ధారణ చేసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి అందుబాటులో ఉందా లేదా అని గమనించారు.

ఎగ్జామ్‌ హాల్లోకి ఎవరైనా సెల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లతో వచ్చారా అని కలెక్టర్‌ ఉపాధ్యాయులతో వాకబు చేశారు.

పరీక్ష కేంద్రం సి సెంటర్ గా కొనసాగుతున్నందున ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు.

ఎక్కడ కూడా కాపీయింగ్‌కు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, నిర్వాహకులను కలెక్టర్‌ ఆదేశించారు. పరీక్షలు ముగిసేంత వరకు కూడా ఎంతో అప్రమత్తతతో పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని సూచించారు.

 ప్రశ్న పత్రాలను తప్పనిసరిగా తగిన పోలీసు బందోబస్తు మధ్య కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు.

పరీక్షా కేంద్రంలో 43 మంది విద్యార్థుల గాను 42 మంది విద్యార్థులు హాజరయ్యారని నిర్వాహకులు కలెక్టర్కు తెలిపారు. కలెక్టర్‌ వెంట పరీక్షా కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ దశరథం, డిపార్ట్మెంటల్ అధికారి హతిరామ్, సి కస్టడీన్ రవీందర్ తదితరులు ఉన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్ జిల్లా

Related posts

ఈనెల 31న తిరుమ‌ల‌లో పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

Satyam NEWS

ఉత్సాహం పై నీళ్లు చల్లిన అమిత్ షా

Satyam NEWS

టెక్నికల్‌ సర్టిఫికెట్‌ పరీక్ష కోసం దరఖాస్తుల స్వీకరణ

Satyam NEWS

Leave a Comment