29.7 C
Hyderabad
May 4, 2024 05: 18 AM
Slider మహబూబ్ నగర్

టెక్నికల్‌ సర్టిఫికెట్‌ పరీక్ష కోసం దరఖాస్తుల స్వీకరణ

#DEO Nagarkurnool

రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సంచాలకుల ఆదేశాల మేరకు  2022 సంవత్సరంలో నిర్వహించే టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

డ్రాయింగ్‌ మరియు టైలరింగ్‌, ఎంబ్రయిడరీ లోయర్‌, హైయ్యర్‌ గ్రేడ్‌ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

లోయర్‌ పరీక్ష రాసే అభ్యర్థులు కనీస విద్యార్హత ఏడో తరగతి పాసై ఉండాలని, హైయ్యర్‌ పరీక్ష రాసే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో లోయర్‌ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలన్నారు.

డ్రాయింగ్‌ లోయర్‌కు నవంబర్‌ 15లోగా రూ.100 ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే డ్రాయింగ్‌ హైయ్యర్‌ కోసం రూ.150 చెల్లించాలని, టైలరింగ్‌ లోయర్‌ కోసం రూ. 150, టైలరింగ్‌ హైయ్యర్‌ కోసం రూ.200 అపరాధ రుసుము లేకుండా నవంబరు 15వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

50 రూపాయల అపరాధ రుసుముతో నవంబర్ 22వ తేదీ, 75 రూపాయల అపరాధ రుసుంతో నవంబర్ 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ఇతర వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పరీక్షల విభాగాన్ని సంప్రదించాలన్నారు.

Related posts

ఖమ్మంలో ఘనంగా అంబెడ్కర్ జయంతి ఉత్సవం

Satyam NEWS

ఫారెస్ట్ భూములకు పట్టాలు ఇవ్వాలి: సిపిఎం

Satyam NEWS

భాగ్యనగర్ యువకులారా…. మజ్లిస్ సవాల్ ను స్వీకరించండి

Satyam NEWS

Leave a Comment