25.7 C
Hyderabad
May 9, 2024 08: 28 AM
Slider వరంగల్

ఓటరును చైతన్య పరిచే ధైర్యం పార్టీలకు ఎందుకు లేదు..?

సేవ చేసే అవకాశం ఒక్కసారి ఇవ్వండి.. మేమేంటో చూపిస్తాం అని గొప్పలు చెప్పి గద్దెనెక్కిన మరుక్షణం నుండే వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం. మెట్లు వేసుకునే కుటిల స్థితిని వీడి ప్రజల కోసం పనిచేసే రాజకీయ నాయకులు మాత్రమే ప్రజా క్షేత్రంలోకి రావాలని తెలంగాణ ఉద్యమకారుడు రాయబారపు రమేష్ డిమాండ్ చేశారు. దశాబ్దాల తరబడి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పుకునే రాజకీయ నాయకుల తీరుతో సమాజం సిగ్గుతో తలదించుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల ఓట్లతో గెలుపొందిన వార్డుమెంబర్ నుండి కేబినేట్లో కొనసాగే మంత్రుల వరకు అధికారులను తొత్తులుగా మలుచుకుని ఇసుక, మట్టి, మద్యం, భూ కబ్జా, డ్రగ్స్, మెడికల్, రియల్ ఎస్టేట్, కార్పోరేట్, ఆక్రమ వ్యాపార మాఫీయాలను బినామీ పేర్లతో యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య యుతంగా నాయకుడిని ఎన్నుకునే ఓటరును చైతన్య పరిచే ధైర్యం ప్రభుత్వాలకు ఎందుకు లేదని ప్రశ్నించారు.

ప్రజాసేవ పేరుతో కోట్లకు పడగలెత్తి పత్తిపూసలం అని చెప్పుకునే దౌర్భాగ్యస్థితికి రాజకీయం దిగజారి పోయిందని, రాజకీయ లబ్ధికోసం పేద ప్రజల రక్తాన్ని రాక్షస బల్లుల్లాగా పీల్చుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయ చదరంగంలో అధికార పక్షం. విపక్షాల పేరుతో ప్రజల దృష్టిని మరల్చి స్వీకార్యాన్ని సక్కగా కానిచ్చేసుకుంటున్నారని, నేడు జరుగుతున్న అనేక అక్రమాలు, అసాంఘిక చర్యలు, అఘాయిత్యాల్లో రాజకీయ నాయకుల మిత్రవర్గం, కోటరీవర్గం, బంధువర్గం, పార్టీవర్గం, అనునాయ వర్గం వారే నేరారోపణలు ఎదుర్కోవడం పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు.

రాష్ట్ర ప్రజల తలరాతను మార్చే శక్తి ఓటుకు మాత్రమే ఉందని, భవిష్యత్ కాలంలో ప్రజలు చైతన్యవంతులు కాకపోతే తరతరాల భవితవ్యాన్ని తాకట్టు పెట్టే స్థితికి చేరుతామని హితవు పలికారు. సామాన్య ప్రజలను మోసం చేస్తూ రాజకీయ పార్టీలను కాపాడుకునే యోచనలో నాయకులు ఉన్నారు తప్పా… ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలనే తపన కొరవడిందని విమర్శించారు.

వివిధ పార్టీల పేరుతో వారి బుడ్డ బుడ్డ హోదాలు చెప్పుకుంటూ రెవెన్యూ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎక్సైజ్, సంక్షేమ శాఖలు, వివిధ జిల్లా కార్యాలయాల్లో, బ్రోకర్లుగా మారి న్యాయ, అన్యాయాల పేరుతో బాధిత ప్రజలను పీడించుకుంటూ రోజు వారి పబ్బం గడుపుకుంటున్నారని, ఇప్పటికైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు మేల్కోకపోతే రాబోయే కాలమంత అంధకారంగా మారుతుందని అన్నారు.

Related posts

న్యూడ్ వీడియో కాల్.. ఆపై బెదిరింపులు

Satyam NEWS

బరిలోకి బాలయ్య.. ముఖ్య నేతలతో కీలక సమావేశం

Bhavani

ద‌క్షిణ తెలంగాణ‌పై కేసీఆర్ శీత‌క‌న్ను: కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment