40.2 C
Hyderabad
May 5, 2024 16: 38 PM
Slider విజయనగరం

రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన ఎస్వీఎన్ స్వప్న లోక్

#kolagatla

రియల్ ఎస్టేట్ రంగంలో నూతన ఒరవడికి  శ్రీకారం చుట్టిన ఎస్విఎన్ శ్రీనివాసా సుజాత గ్రూప్ ఎంతైనా అభినందనీయమని…ఏపీ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్  కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం ఎంఎల్ఏ బొత్స అప్పల నరసయ్య, నెల్లిమర్ల ఎంఎల్ఏ  బడ్డు కొండ అప్పలనాయుడు, శృంగవరపుకోట ఎంఎల్ఏ   కడుబండి  శ్రీనివాసరావు,ఎంఎల్సీ డాక్టర్ పి. వి.వి  సూర్యనారాయణ రాజు, అరకు పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్ శత్రుచర్ల పరీక్షిత్  రాజు, రాష్ట్ర మారిటోరియం చైర్మన్ కాయల వెంకటరెడ్డిలు  కొనియాడారు.

ఈ మేరకు ఎస్ కోట నియోజకవర్గం పరిధిలో తాటిపూడి రిజర్వాయర్ సమీపంలో 160 ఎకరాల సువిశాల ప్రాంతంలో ఎస్ వి ఎన్ శ్రీనివాస సుజాత గ్రూప్  నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ వి ఎన్ స్వప్నలోక్  రియల్ ఎస్టేట్ నూతన  వెంచర్ ను ప్రారంభించారు ముందుగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిధులు చేతిలో మీదుగా  ఎస్ పి ఎన్ స్వప్నలోక్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు సంబంధించిన బ్రోచర్లను విడుదల చేశారు.

జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి  శ్రీనివాసరావు సంస్థకు సంబంధించిన కార్పొరేట్ వెబ్సైట్ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం వస్తున్న త, మరోపక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంద నేపథ్యంలో అరకు, అనంతగిరి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్న సమయంలో తాటిపూడి ప్రాంతంలో నూతన వెంచర్ ఏర్పాటు చేయడం సంస్థ నిర్వాహకులు ఎంతైనా అభినందనీయులని అన్నారు .

సుమారు 160 ఎకరాలలో అందర్నీ ఆహ్లాదపరిచే రీతిలో , ప్రకృతి ఒడిలో అందమైన వెంచర్ ఏర్పాటు చేసి , అందరికీ ఆమోదయోగ్యమైన ధర లో, అన్ని రకాల వసతులతో వెంచర్ను ఏర్పాటు చేయడం సాహసోపేత నిర్ణయమని అన్నారు. జిల్లాలోని కనివిని ఎరుగని రీతిలో అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ, ప్రకృతి కనుమల మధ్య మంచి లేఅవుట్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు.

ఈ  ఎస్విఎన్ గ్రూపు అనగానే ప్రజలలో మంచి అభిప్రాయం ఉందని, ప్రజలలో ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిర్వాహకులు సాహసోపేతంగా అన్ని రకాల వసతులు ఒకచోటే కల్పించే విధంగా  వెంచర్ను ఏర్పాటు చేసి, ప్రజల అభిమానాన్ని పొందాలని అన్నారు. సీఎం జగన్  పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే ఈ నూతన వెంచర్ పక్కనే సుమారు 1200 ఎకరాలలో జిందాల్ పరిశ్రమ రాబోతుందని తెలిపారు. అలాగే బొడ్డవర నుంచి రాయపూర్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా రాబోతోందని అన్నారు.

అరకు ,అనంతగిరిని టూరిజం హబ్ గా ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్న ఈ వెంచర్ లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయనే ధీమాను వ్యక్తం చేశారు. సంస్థ చైర్మన్ జి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల ఆశీస్సులతో ఎస్విఎన్ గ్రూపు ఏర్పాటు చేసి ఆప్టికల్ రంగంలోనూ, ఫోటో రంగంలోనూ ప్రజల అభిమానాన్ని చురగున్నామని, అదే స్ఫూర్తితో ఎస్విఎన్ నగర్ వెంచర్ను ఏర్పాటు చేసి విజయం సాధించామని, సమాజానికి భక్తి భావాన్ని కూడా అందించాలని ఉద్దేశంతో జ్ఞాన సరస్వతి ఆలయాన్ని, పశుపతి నాధెశ్వర ఆలయాన్ని  కూడా నిర్మించి అభిమానాన్ని పొందామని అన్నారు.

ప్రస్తుత ఆధునిక , సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని తమ కుమారులు కార్తీక్, ఈశ్వర్ కౌశికుల ఉత్సాహంతో ఎస్విఎన్ స్వప్నలోక్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగిందని అన్నారు. సంస్థ డైరెక్టర్ లు కార్తీక్, ఈశ్వర్ కౌశికులు మాట్లాడుతూ పెట్టుబడిదారుల నమ్మకాన్ని మమ్ము చేయకుండా, వారి కలలు ఫలించే విధంగా ఎస్విఎన్ స్వప్నలోక్ అందంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. 

కార్యక్రమంలో రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నే క్కల నాయుడు బాబు, డిసిసిబి చైర్మన్ వెంకట చిన్న రామనాయుడు, నగర మేయర్  వెంపడా పు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి,ఇసరాపు రేవతి దేవి, మాజీ శాసనమండలి సభ్యులు గాదె శ్రీనివాసులు నాయుడు, సంస్థ ప్రతినిధులు, వ్యాపారులు, ఖాతాదారులు , ఆయా రాజకీయ  పార్టీ ల ప్రతినిధులు  పాల్గొన్నారు.

Related posts

అధునాతన మట్టి పాత్రల తయారీ యంత్రాలు పంపిణీ

Satyam NEWS

ఎకరాకు రూ. లక్ష చెల్లించాలి

Bhavani

బీ కూల్ రోజమ్మ : అంతా నేనుచూసుకుంటానన్న జగన్

Satyam NEWS

Leave a Comment