36.2 C
Hyderabad
May 7, 2024 14: 48 PM
Slider వరంగల్

జనాన్ని ఆకట్టుకుంటున్న శ్యామ్ కళా యాత్ర

#mulugu

జాగృతి చైతన్య కళాయాత్ర లో భాగంగా పోరిక శ్యామల్ నాయక్ ములుగు మండలంలో ఓటర్ల చైతన్యంపై పర్యటించారు. గ్రామ వార్డు మెంబర్లు గణేష్, గోవర్ధన్ రెడ్డి, బానోత్ సమ్మయ్య, సుధాకర్ అమర్ సింగ్ రవి ఐలయ్యలతో శ్యామ్ గణేష్ పల్లె లో ర్యాలీలో పాల్గొన్నారు. ఇంటింటికి ఆత్మీయతగా పలకరిస్తూ గ్రామంలో తిరిగారు. సాయంత్రం 6 గంటలకు శ్యామ్ కళాబృందం వారిచే మూఢనమ్మకాల గురించి బాల్యవివాహాలు చేయకూడదని ఆటపాటల ద్వారా వివరించారు.

జీవింతరావుపల్లి పల్లెలో యూత్ అధ్యక్షుడు హరీష్, మహిళా సంఘం అధ్యక్షులు ఉమాదేవి వెంటరాగా సమాజంలో యువ శక్తికి ఎదురు లేదు అని అన్నారు. సమ సమాజ నిర్మాణం కోసం అందరూ నడుం కట్టాలన్నారు. సాయంత్రం 6 గంటలకు గ్రామ సర్పంచ్ రత్నం భద్రయ్య ఉప సర్పంచ్ రమాదేవి స్వచ్ఛభారతం ఆరోగ్య తెలంగాణ గురించి వివరించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేయడానికి అందరూ నడుం కట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ కళా సేవ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.

అందరూ పాదయాత్రలు జోడోయాత్రలు చేశారు కానీ కళల ద్వారా జన చైతన్యం చేయడం అద్భుతం అన్నారు. పందికుంట, భూపాల్ నగర్ గ్రామాలకు కూడా ర్యాలీగా వెళ్లారు. సర్పంచ్ పసుల సాంబయ్య రామ్ రెడ్డి కొమరారెడ్డి గుండెబోయిన ఓదెలు చిలకల రవి ర్యాలీలో పాల్గొన్నారు. రైతులందరూ ఆత్మహత్య చేసుకోకుండా ఆనందంగా గడపాలని అన్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రోగ్రాం చేస్తూ ఓటు చైతన్యం గురించి ప్రమాణం చేయించారు.

ఎస్సీ జిల్లా నాయకుడు గడ్డం భద్రయ్య ప్రోగ్రాంలో ప్రత్యేకంగా వచ్చి సమాజ సేవకై శ్యామ్ తిరగడం వారి జీవితం సార్థకం అవుతుందని కొనియాడారు. జాకారం గ్రామంలో కోరిక శ్యామల నాయక్ గ్రామ సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ కుమార్ ప్రశాంత్, పెద్దమనిషి సురేందర్ వెంటరాగా గ్రామంలో ర్యాలీగా తిరిగారు. తర్వాత సాయంత్రం 6 గంటలకు గ్రామపంచాయతీ ఆవరణలో 200 గ్రామస్తులందరూ రాగా ఓటు చైతన్యం గురించి తెలిపారు.

స్వచ్ఛభారతం గురించి, చదువుల తల్లి గురించి రకరకాల పాటలు పాడి అందరిని ఉత్సాహ పరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు అందరు స్వచ్ఛందంగా గ్రామ గ్రామాలకు సహకరిస్తున్నారని టీం లీడర్ రవీందర్ అన్నారు. ఈ కార్యక్రమానికి వాయిద్య సహకారం ఇనుముల రంజిత్, అరుణ్, రేనుగుంట్ల శ్రీధర్, కుర్రి చిరంజీవి, దూడపాక రాజేందర్ కళాకారులు పోలేపాక చిన్ని పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కలువాల సంజీవ సాయి మహమ్మద్ మహిపాల్ రెడ్డి తదితర గ్రామస్తులు శ్యామ్ యాత్రను విజయవంతం కావాలని వేడుకున్నారు. రామచంద్రపురం గ్రామంలో శ్యామ్ కళా యాత్ర శ్రీరామనవమి నాడు గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి ఓటు చైతన్యం మూఢనమ్మకాలు స్వచ్ఛభారతం కార్యక్రమాల మీద ర్యాలీ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కల్పన, ఉప సర్పంచ్ అశోక్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా సాగింది.

జంగాలపల్లి గ్రామంలో శ్యామ్ కళా యాత్ర వినయ్ కుమార్ సర్పంచ్  అనుమతితో గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో ఓటు చైతన్యం గురించి వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఉప సర్పంచ్ మొగిలి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జంగాలపల్లి గ్రామం టప్ప కృష్ణయ్య ద్వారా ప్రాచుర్యం పొందింది అన్నారు. సాయంత్రం 7గంటలకు ఎస్సీ కాలనీలో శ్యామ్ కళాబృందం కార్యక్రమం నిర్వహించింది.

అంగన్వాడీ వసంత బోల్లి కవిత ఆశ వర్కర్లు జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత  ఆనతితో బాలింతలకు అందరికీ చిరుధాన్యాల ఆవశ్యకత గురించి చెప్పారు. వార్డ్ మెంబర్ మేకల సుశీల, గ్రామ పెద్దమనుషులు మేకల మొగిలి నూనె బాగా శంకర్ మామిడి చెట్టు వెంకన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్యామ్ చేసే జన చైతన్య కళాయాత్రలో స్వచ్ఛందంగా జంగాలపల్లి గ్రామ కళాకారులు బొచ్చు అరుణ్ కుమార్, రేణుకుంట్ల శ్రీధర్, ఇనుముల రంజిత్, దూడపాక రాజేందర్, బోదానంద దాసి వనమాల ని కోరిక శ్యామల్ నాయక్ ఘనంగా శాలువాలతో సత్కరించారు.

Related posts

ఉపాధిహామీ బిల్లులను చెల్లించకపోతే హైకోర్టు ను ఆశ్రయిస్తాం

Satyam NEWS

నకరికల్లు వద్ద భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం

Satyam NEWS

కిటకిటలాడుతున్న పశ్చిమగోదావరి శైవ క్షేత్రాలు

Satyam NEWS

Leave a Comment