చిత్తూర్ జిల్లా లో పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా తో నగరి నియోజకవర్గ పార్టీ పరిస్థితులపై చర్చించినట్లు కనబడుతుంది.ఇటీవల నగరి నియోజకవర్గంలో ఎంతో కాలంగా ఉన్న తమను కాదని ఇతర పార్టీల వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే రోజాను అడ్డుకున్నారు. వీరిపై ఆమె కేసులు పెట్టగా దీనిపై జగన్ ఆమెను వివరణ కోరినట్లు తెలుస్తుంది.
ఏఈ విషయమై వారిద్దరూ ‘సీరియస్’గా చర్చించడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అమ్మఒడి సభలో అధ్యక్షత వహించిన చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడాక రోజా ప్రసంగించారు. వేదికపైన జగన్ పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీసులయ్యారు. రోజా అదే వరుసలో కొద్దిగా దూరంగా కూర్చొన్నారు. పెద్దిరెడ్డి ప్రసంగించే సమయంలో రోజా ఆయన కుర్చీలోకి వెళ్లారు. ఆ తర్వాత సీఎంతో చాలా సీరియస్‌గా చర్చిస్తూ కనిపించారు.
పార్టీ పరిస్థితి పై ,అభివృద్ధిపై గుక్క తిప్పుకోకోకుండా చెబుతున్నరోజాను మంచి నీళ్లు తాగాలని సీఎం సూచించారు. ఆ తర్వాత ఆమెను ఊరడిస్తూ తల నిమిరారు. తొందరపడవద్దని అందరిని కలుపుకు పోవాలని అయన రోజాకు సూచించారు. బీ కూల్ రోజమ్మ : అంతా నేనుచూసుకుంటానన్నరు జగన్.