29.7 C
Hyderabad
May 6, 2024 06: 42 AM
Slider విజయనగరం

స్మిమ్మింగ్ పోటీలను ప్రారంభించిన విజయనగరం డిప్యూటీ మేయ‌ర్

#kolagatlashravani

సీఎం జ‌గ‌న్  క్రీడలుకు  ఎంతో  ప్రాముఖ్యత ఇస్తున్నారని విజ‌య‌నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు.  రాజీవ్ స్టేడియంలో  శాప్ నిర్వహణలో   జిల్లా  క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఫుట్ బా ల్ లీగ్ టోర్నమెంట్  ను, అలాగే బాక్సింగ్ లీగ్ టోర్నమెంటు, నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో స్విమ్మింగ్ లీగ్  పోటీలను, కోకో లీగ్  పోటీలను ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ మేయ‌ర్ మాట్లాడుతూ. శారీరక దారుఢ్యం తో పాటు, వ్యక్తిగత వికాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడుతుంద‌న్నారు. ఇప్పటికే ఇండోర్ స్టేడియం , విజ్జి స్టేడియం, రాజీవ్ స్టేడియం, కోడి రామమూర్తి వ్యాయామశాల , ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి క్రీడా ప్రాంగణాల ను మంత్రి,ఎమ్మెల్యేల‌ కృషి తో అభివృద్ధి చేస్తున్నామ‌న్నారు.

ఇక ప‌లువురు స్విమ్మింగ్ క్రీడాకారులు చక్కటి తర్ఫీదు పొంది జిల్లా, రాష్ట్రస్థాయిలో పథకాలు సాధించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా  ఆయా పోటీలలో గెలుపొందిన విజేతలకు  డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి  మెడల్స్ అందజేశారు.

ఈ  కార్యక్రమంలో  జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి వెంకటేశ్వరరావు,కార్పొరేటర్లు ఆసపూ  సుజాత,  బోనెల ధనలక్ష్మి ,పొట్నూరు శ్రీనివాసరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కాళ్ల సూరిబాబు, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి. శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ కరణం రమణ రావు, జై నాగేశ్వరరావు,ఎన్. తులసి యాదవ్,బి. శ్రీనివాస రావు, బేతా అప్పారావు, పి. సతీష్, ఇళ్ళపు రమణ , ఆయా విభాగాల  కోచ్ లు , తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జగన్ ప్రభుత్వంపై వై ఎస్ సన్నిహితుల అసంతృప్తి

Satyam NEWS

ప్రజలకు సంజీవినిలా రక్త నిధి కేంద్రాలు

Satyam NEWS

తెలుగు చిత్రం టొరెంటోలో ప్రారంభం !!!

Bhavani

Leave a Comment