37.2 C
Hyderabad
May 2, 2024 13: 03 PM
Slider ముఖ్యంశాలు

కొల్లాపూర్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పట్టించుకునే నాథుడే లేడా…?

#telanganatalli

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేవలం తెలంగాణ అనే సెంటిమెంట్  వాడుకొని  ప్రజలతో ఓట్లు పొందడానికి చూస్తున్నారు తప్ప తెలంగాణ తల్లి విగ్రహానికి ఏం జరిగినా పట్టించుకునే పరిస్థితుల్లో లేరని  చెప్పడానికి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే ఒక ఉదాహరణ. 

కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్ర పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎడమ చెయ్యి విరిగి మూడు నెలలు కావస్తోంది. సోషల్ మీడియా ద్వారా  అనేక రకాలుగా తెలియజేసిన  ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు.  కనీసం ఆ వైపు కూడా చూడడం లేదు. ఎన్నోసార్లు ఆ ప్రాంతానికి కూడా యన వెళ్లారు.

కనీసం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిశీలించిన సందర్భం కూడా లేదు. గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన జెఎసి సభ్యులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కనీసం మున్సిపల్ పాలకులు,ఎమ్మెల్యే అనుచరులు కూడా ఎవ్వరు పట్టించుకోవడం లేదు.

ఎమ్మెల్యే  తెలంగాణ ఉద్యమం చేసింటే తెలంగాణ తల్లి విలువ తెలుస్తుండే. అప్పుడు తెలంగాణను వ్యతిరేకించినవారు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రిగా ఉన్నారు. వారికి ఈ విలువలు ఏమి తెలుస్తాయని కొందరు అంటున్నారు. ప్రస్తుతం నేతలు  సొంత స్వాలాభాల కోసమే తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుంటున్నారు. అంతే కానీ ఉద్యమ  సిద్ధాంతాలు లేవని  కొందరు అంటున్నారు.

తెలంగాణ సెంటిమెంట్ ఉద్యమ విలువలు తెలిసిన వారైతే తెలంగాణ తల్లిని గౌరవిస్తారు. మొన్న ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా పట్టణ కేంద్రంలో   ర్యాలీ చేశారు. కానీ తెలంగాణ తల్లి విగ్రహం వైపు చూడలేదు. ముందు తెలంగాణ తల్లి విగ్రహం మరమత్తులు చేయించండి, ఆ తర్వాత పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం గురించి ఆలోచించండి అంటూ మరికొందరు అంటున్నారు.

దళితుల మధ్యలో చిచ్చు పెట్టే రాజకీయాలు మానుకొని  విలువలతో కూడిన రాజకీయం చేయాలి అంటున్నారు. గతంలో మంజూరు అయిన అభివృద్ధి సంక్షేమాల దగ్గర ఫోటోలు దిగడం కాదు, ఇలాంటి విగ్రహాల మరమత్తులు కూడా చేయించాలని పట్టణ ప్రజలు అంటున్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

సిమెంట్ ధరలు పెరిగినా? కార్మికుల వేతనాలు పెరగవా?

Satyam NEWS

చట్టసభల నిర్వహణ కత్తిమీద సాము

Satyam NEWS

చిన్నారి చైత్ర హంతకుడికి వెంటనే ఉరిశిక్ష విధించాలి

Satyam NEWS

Leave a Comment