33.7 C
Hyderabad
April 29, 2024 23: 39 PM
Slider నిజామాబాద్

పిచ్చికుక్కలా బైరి నరేష్ వ్యాఖ్యలు

గుడిమేట్ ఆలయ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ ఫైర్

అయ్యప్ప పుట్టుకపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమేట్ మహాదేవుని ఆలయ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ ఫైర్ అయ్యారు. నరేష్ ను పిచ్చికుక్కతో పోల్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నరేష్ మాటలు సంస్కార హీనంగా ఉన్నాయన్నారు. జ్ఞానం లేకుండా అనుచితంగా మాట్లాడాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహనీయుడు అంబెడ్కర్ ను అడ్డుపెట్టుకుని నాస్తికుడినంటూ మాట్లాడటం సరైంది కాదన్నారు. నీకు దేవుళ్ళపై నమ్మకం లేకపోతే నిన్నెవడు మొక్కుమంటున్నాడురా పిచ్చికుక్క అంటూ ఫైర్ అయ్యారు.

అంబెడ్కర్ ఆశయాలు, ఆలోచనలు చాలా గొప్పవని, అలాంటి మహాత్ముని అడ్డుపెట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేస్తావురా లుచ్చా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. త్రివర్ణ పతాకం కంటే ముందు కాషాయ జెండా ఉండాలని చెప్పిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని అడ్డుపట్టుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనను అవమానించినట్టేనన్నారు. నీ తాత, నీ అమ్మ, నీ తండ్రి ఎవరో తెలుసుకోవాలని సూచించారు. హిందూ ధర్మం, సనాతన ధర్మాలు, హిందు దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరైనా, ఎంతటి పదవుల్లో ఉన్నా చెప్పుదెబ్బల పాలవుతారని హెచ్చరించారు. బైరి నరేష్ పై వెంటనే పిడి యాక్టు నమోదు చేయాలని, అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందు దేవతలు, ధర్మాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో హిందూధర్మ సంఘాలు వారికి ఎలాంటి శిక్షలు విధిస్తాయో మున్ముందు చూస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ భక్తులు ఆకాష్, గణేష్, బస్వరాజ్, గంగాధర్, విశ్వశ్వర్ పాల్గొన్నారు.

Related posts

సివిల్స్ శిక్షణ కోసం పేద వైశ్య విద్యార్థికి లక్ష రూపాయల సాయం

Satyam NEWS

అవినీతిపరులను రక్షించేందుకు కేంద్రం మార్గదర్శకాలు

Satyam NEWS

దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా జమ్మికుంట

Satyam NEWS

Leave a Comment