40.2 C
Hyderabad
May 5, 2024 15: 34 PM
Slider మహబూబ్ నగర్

పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలి

#collectorwanaparthy

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బృహత్ పల్లె ప్రకృతి వనాలు ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.

శనివారం వనపర్తి జిల్లాలోని సవాయిగూడెం గ్రామ పంచాయతీలోని పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని 14 మండలాల్లో, ప్రతి మండలానికి 10 ఎకరాలలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (MGNREGS), గ్రామీణ అభివృద్ధి (Rural Development) ద్వారా రూ.40 లక్షల వరకు నిధులు సమకూర్చడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సూచించారు. ఒక యూనిట్ కు 31 వేల మొక్కలు నాటడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అటవీశాఖ, సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో బృహత్ పల్లె ప్రకృతి వనాలను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అధికారులకు తెలిపారు. అంతకుముందు ఎకో పార్క్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు.

ఈ కార్యక్రమంలో డి.పి.ఓ. సురేష్ కుమార్, డీ.ఎఫ్.ఓ. పెండ్యాల రామకృష్ణ, డి.డబ్ల్యూ.ఓ. పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

విజయనగరం ప్రదీప్ నగర్ లో “సర్వ ధర్మ స్థూపం” ఆవిష్కరణ…!

Bhavani

మ‌రో శైవ క్షేత్రం పుణ్య‌గిరిలో విజ‌య‌న‌గ‌రం పోలీస్ బాస్

Satyam NEWS

19,20 తేదీలలో అరుణోదయ ‌సాంస్కృతిక  సమాఖ్య రాష్ట్ర సభలు

Murali Krishna

Leave a Comment