28.7 C
Hyderabad
May 5, 2024 10: 43 AM
Slider అనంతపురం

విలువైన ప్రాణాల పట్ల నిర్లక్ష్యం వద్దు

#atp

రోడ్డు ప్రమాదాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలకు ముప్పు తప్పదని రోడ్డు ప్రమాదాలలో చాలామంది విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది బాధాకరం, ఎవరు ప్రమాదాలకు గురికాకుండా ఖచ్చితంగా వాహనం నడిపే సమయంలో  రోడ్డు నిబంధనలు పాటించాలని రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎస్.కృష్ణమూర్తి అన్నారు. స్థానిక కే ఎస్ ఎన్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో ఆగ్రా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. 

సంస్థ అధ్యక్షులు అశ్వర్థ నారాయణ స్వామి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ లక్ష్మి రంగయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఫిజిక్స్ అధ్యాపకుడు  తిమ్మారెడ్డి అకారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను ఒక ఉదాహరణ తెలిపారు. ఒక భార్యాభర్త తన బిడ్డతో కలసి ద్విచక్ర వాహనంలో వెలుతూ మార్గ మధ్యంలో రోడ్డుకు పక్కన వాహనం నిలిపి ఉండగా మరో నాలుగు చక్రాల వాహనం రాంగ్ రూట్ లో వేగంగా వచ్చి ఈ ముగ్గురిపై దూసుకుపోయిందని తెలిపారు. ఈ సంఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని వివరించారు.

అభం శుభం తెలియని ఆ ముగ్గురు రోడ్డు నిబంధనలకు అనుగుణంగా వాహనం నడిపి రోడ్డుకు ఎడమవైపున వాహనం ఆపినా ప్రమాదానికి గురికావడం దురదృష్టకర మన్నారు. అదేవిధంగా మద్యం సేవించి మందు నడిపేవారితో చాలా ప్రమాదం అని గచ్చరించారు..మైకంలో వారు వాహనాన్ని నడిపి వారి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడమే గాక ఎదురుగా వస్తున్న వాహనాలలో ప్రయాణించే వారికి కూడా ప్రమాదం అని హెచ్చరించారు.

విద్యార్థులు మాటల్లో పడి విచక్షణ లేకుండా రోడ్డు మధ్యలో నడుచుకుంటూ వెళుతున్నారని హారన్ ఇచ్చినా వారు పట్టించుకోవడం లేదని .రోడ్డుకు ఎడమ వైపున నడవడం చాలా మంచిదని తెలిపారు. కళాశాల లెక్చరర్ పర్వీన్ మాట్లాడుతూ స్వేచ్ఛ ఉందని రోడ్డుపై ఇష్టారాజ్యంగా వాహనాలు నడపరాదన్నారు. భౌతిక శాస్త్రం అధ్య్యపకుడు తిమ్మా రెడ్డి మాట్లాడుతూ రోడ్డు పక్కన ముందస్తు సూచనలు చేస్తూ ఏర్పాటు చేసిన బోర్డుపై చేసిన సూచనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపారు.

నిరంతరం మనుషి పని వత్తిడి లో ఉండి త్వరగా గమ్యం చేరాలని ఆతృతతో వేగంగా, రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను నమ్ముకుని కుటుంబం ఉందనే విషయాన్ని మరచిపోకుండా వాహనాలను జాగ్రత్తగా నడిపి సురక్షితంగా గమ్యం చేరుకోవాలని హితవు పలికారు. విశ్రాంత ప్రధానోధ్యాయుడు సూర్యనారాయణ రెడ్డి  మాట్లాడుతూ విద్యార్థులు భావి భారత పౌరలని, ఈ దేశానికి ఆస్తి యువత అన్నారు..

ఇలాంటి విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడిపోకుండా వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ ఒక్కరు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా సమాజంలో చైతన్యం తెచ్చే బాధ్యతను విద్యార్థులు తీసుకోవాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ అధికారి వెంకటనాయుడు, సుమారు 250 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణపై తీసుకోవాల్సిన చర్యలపై రూపొందించిన గోడ  పత్రికను విడుదల చేశారు.

సత్యం న్యూస్, అనంతపురం

Related posts

రికవరీ చేసిన 564 ఫోన్లు తిరిగి అందచేసిన కర్నూలు ఎస్పీ

Satyam NEWS

కర్ణాటకలో కరోనా కొత్త వేరియంట్ కలకలం: ఏడుగురికి పాజిటివ్

Satyam NEWS

ఓటును నమోదు చేసుకున్న శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి

Satyam NEWS

Leave a Comment