25.2 C
Hyderabad
May 13, 2024 10: 55 AM
Slider ముఖ్యంశాలు

అక్రమ వ్యాపారాలపై పోలీసులు మూకుమ్మడి దాడులు

#SuryapetPolice

సూర్యాపేట పట్టణంలో అక్రమ వ్యాపారాలపై పట్టణ పోలీసు స్టేషన్, టాస్క్ ఫోర్స్ పోలీసు సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 16 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. గుట్కా అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకుని 1.5 లక్షల రూపాయల విలువగల గుట్కా స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్బంగా సూర్యాపేట పట్టణ CI ఆంజనేయులు  మాట్లాడుతూ జిల్లా యస్.పి భాస్కరన్  ఆదేశాల ప్రకారం రెండురోజులుగా పట్టణంలోని అక్రమ వ్యాపారాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించామన్నారు.

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని 16 ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేశామని, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న  35 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. కుడకుడ, ఖమ్మం X రోడ్, కూరగాయల మార్కెట్, కొత్తబస్టాండ్ ప్రాంతాల్లో  సోదాలు చేసి 1.5 లక్షలు ప్రభుత్వ నిషేధిత గుట్కా ను సీజ్ చేశామని గుట్కా వ్యాపారులపై 4 కేసులు నమోదు చేసి 6 గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని తెలిపారు.

పట్టణంలో అక్రమ వ్యాపారాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. ఎవరైనా అక్రమ వ్యాపారాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు అని అన్నారు. రెండు రోజులుగా నిర్వహించిన దాడుల్లో టాస్క్ఫోర్స్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ నిరంజన్, ccs సిబ్బంది, పట్టణ SI లు భిక్షపతి, శ్రీనివాస్, ఏడుకొండలు, పట్టణ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

తెలుగుదేశం వల్లే కోడెలకు మనస్తాపం

Satyam NEWS

మంత్రి కాన్వాయ్ ని ఢీకొన్న ద్విచక్ర వాహనం

Satyam NEWS

గంజాయి సాగుపై ఏపీ డీజీపీ ఆసక్తి కర వ్యాఖ్యలు…!

Satyam NEWS

Leave a Comment