ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తన ఆఖరి రోజుల్లో ఎంతో మానసిక వేదన అనుభవించారు. ఆయన పై రకరకాల వత్తిడులు పని చేశాయి. అందులో ముఖ్యంగా అసెంబ్లీ ఫర్నీచర్ కేసు విషయం లో తెలుగుదేశం పార్టీ అనుసరించిన వైఖరి ఆయనను తీవ్రమనస్థాపానికి గురిచేసింది. రాజకీయంగా తనకు ఈ కేసు విషయంలో తెలుగుదేశం పార్టీ నుంచి కనీస మద్దతు కూడా దొరకలేదని ఆయన చివరి రోజుల్లో తీవ్రంగా వత్తిడికి గురయ్యేవారు. ప్రభుత్వం తనపై కేసు పెట్టే స్థితికి వచ్చిన తర్వాత కూడా వర్ల రామయ్య లాంటి నేతలతో ఈ కేసుతో తమకు సంబంధం లేదని చెప్పించడం కోడెలకు తీవ్ర మనస్థాపం కలిగించింది. తెలుగుదేశం పార్టీ తనను దూరంగా పెడుతున్నదని ఆయన తీవ్రంగా ఆవేదన చెందేవారని నరసరావుపేట కుచెందిన ఆయన సన్నిహితులు అంటున్నారు. కోడెల శివప్రసాదరావు ఎంతో సున్నిత మనస్కుడు. తెలుగుదేశం పార్టీ తన పట్ల చూపిన నిరాదరణ ను ఆయన పదే పదే గుర్తుకు తెచ్చుకుని బాధపడేవారని అంటున్నారు. ఫర్నీచర్ కు సంబంధించిన కేసులో తాను ఫర్నీచర్ వాపసు ఇస్తానని చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ తనకు అండగా నిలబడలేదని కోడెల ఎంతో మధన పడుతుండేవారని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అనుసరించిన వైఖరి పూర్తిగా తన పరువును తీసే విధంగా ఉందని ఆయన అనేవారు. యరపతినేని శ్రీనివాసరావు విషయంలో ఒక రకంగా తన పట్ల మరొక రకంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రవర్తించారని ఆయన తన సన్నిహితులతో అనేవారు. యరపతినేనికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ప్రకటించి ఛలో ఆత్మకూరు లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించింది కానీ తన ఫర్నీచర్ కేసులో మాత్రం అంటీ ముట్టనట్లు ఉండటమే కాకుండా అలాంటి కేసులను తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సమర్ధించదని వర్ల రామయ్యతో చెప్పించారని కోడెల తీవ్రంగా మధన పడ్డారు.
previous post
next post