30.7 C
Hyderabad
May 5, 2024 06: 40 AM
Slider గుంటూరు

మాదకద్రవ్యాల హబ్ గా నరసరావుపేట

#tdp

పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ బస్సు యాత్ర, టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి సెల్ఫీలతో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికార పీఠం కదిలి వెన్నులో ఓటమి భయం పుట్టిందని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డా౹౹చదలవాడ మాట్లాడుతూ బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నదని తెలిపారు. టీడీపీ నాయకులు,కార్యకర్తలతో పాటు,వైసీపీ ప్రభుత్వంలో దగా పడిన సామాన్య ప్రజలు కూడా శ్రీనివాస్ రెడ్డి అవినీతి పాలను వ్యతిరేకంగా బస్సు యాత్రకు సంఘీభావం తెలుపుతున్నారని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి భవనాల వద్ద సెల్ఫీ ఫోటోలు పెడితేనే గోపిరెడ్డి ఓటమియంతో గజగజ వణుకుతున్నారని అన్నారు.

టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి మొత్తం ప్రజలకు వివరిస్తే గోపిరెడ్డి నియోజకవర్గం వదిలి పారిపోతారని డా౹౹చదలవాడ అరవింద బాబు ఎద్దేవా చేశారు. జేఎన్టీయూ కళాశాల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని కళాశాలకు స్థలం కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 35 కోట్ల రూపాయలతో కళాశాల భవనాలు నిర్మించింది కోడెల శివ ప్రసాద్ రావు హయాంలోనని గుర్తు చేశారు.

వైసీపీ నాలుగేళ్ల పాలనలో జేఎన్టీయూ కళాశాల అభివృద్ధికి ఒక రూపాయి కూడా కేటాయించకుండా జేఎన్టీయూ అభివృద్ధి గురించి శ్రీనివాసరెడ్డి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జేఎన్టీయూ కళాశాలకు చీకటి యుగం ప్రారంభమైందని తరగతి గదుల మధ్యలో నీళ్లు చేరి చెరువులను తలపిస్తున్నాయని కళాశాల బాగుకు శ్రీనివాస్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని డా౹౹చదలవాడ నిలదీశారు.

టీడీపీ బస్సు యాత్రతో శ్రీనివాస్ రెడ్డి జేఎన్టీయూ కళాశాల విద్యార్థులకు చేసిన ద్రోహం ప్రపంచానికి తెలిసిందన్నారు. టీడీపీ బస్సు యాత్రతో శ్రీనివాసరెడ్డి అవినీతి,అక్రమాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయని బస్సు యాత్ర శ్రీనివాసరెడ్డి అధికారానికి అంతిమయాత్రగా మారుతుందని జోశ్యం చెప్పారు. ఎడ్యుకేషనల్ హబ్ గా ఉత్తమ పౌరులను రాష్ట్రానికి అందించిన నరసరావుపేట ను గంజాయి,గుట్కా,వంటి మాదకద్రవ్యాలను తీసుకొచ్చి నరసరావుపేటను మాదకద్రవ్యాల పబ్ గా మార్చారని ఇటీవల గుంటూరులో రోడ్డులో చిక్కిన 8 కేజీల గంజాయి అందుకు నిదర్శనమన్నారు.

గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో వేల కోట్ల అక్రమ మైనింగ్ చేశారని కోటప్పకొండ,గురవాయిపాలెం, ములకలూరులో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్ అడ్డాలని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ పై జిల్లా కలెక్టర్,ఎస్ పి కి, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన వారు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని డా౹౹చదలవాడ ఆవేదన చెందారు.

టీడీపీ హయాంలో నిర్మించిన టిట్కో గృహాలు అసలైన లబ్ధిదారుల కాకుండా 400 మంది వైసీపీ గుండాలకు కేటాయించారని దీని పై లబ్ధిదారులతో కలిసి కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేసి గెలిచామన్నారు. 2018-19 అర్హుల జాబితాను అసలైన జాబితాగా గుర్తిస్తూ కోర్టు మున్సిపాలిటీ అధికారులకు పాత లబ్ధిదారులకు గృహాలు కేటాయించమని ఆదేశాలు జారీ చేసిందన్నారు.

మున్సిపల్ కమిషనర్ ను బలవంతపు సెలవులు పెట్టించి మున్సిపాలిటీ అధికారులను బెదిరించి టిట్కో గృహాలు అసలైన లబ్ధిదారులకు అందకుండా చేశారని డా౹౹చదలవాడ అరవింద బాబు మండిపడ్డారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆసుపత్రి చైర్మన్,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 70 లక్షల అక్రమ బిల్లులు మార్చారని విజిలెన్స్ అధికారులు గుర్తించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఉచితంగా మొక్కలు తీసుకుని డివైడర్లు పై నాటి మొక్కల బిల్లుల చెల్లింపు పేరుతో గోపిరెడ్డి ప్రతి ఏటా 70 లక్షలు దోచుకుంటున్నారని అక్రమ బిల్లులు పెట్టడానికి కమిషనర్ ఒప్పుకోకపోతే బలవంతపు సెలవుల పై పంపి మున్సిపాలిటీ నిధులను నిలువు దోపిడీ చేశారని అన్నారు.

గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దృష్టిలో అభివృద్ధి అంటే దోచుకోవడం దాచుకోవడం,టీడీపీ ప్రభుత్వంలో కట్టిన భవనాల నేమ్ బోర్డులో పగలగొట్టమా? కోడేలా స్టేడియం నేమ్ బోర్డ్,టౌన్ హాల్ నేమ్ బోర్డ్,షాది ఖానా,పేదవారి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను ధ్వంసం చేసిన విధ్వంసపురెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని నిప్పులు చెరిగారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అయ్యాక 126 మైళ్ళు విస్తరించి ఉన్న నాగార్జున సాగర్ కుడి కాలువ పూర్తిగా పూడిపోయి కల్వర్టులు పాడైపోయి నీళ్లు పారే పరిస్థితి లేక రైతుల భూములు బీడు వారి పోయాయని శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేయ్యాక నరసరావుపేటను అన్ని విధాలుగా నాశనం చేశారని డా౹౹చదలవాడ అరవింద బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో టీడీపీ చేసే బస్సు యాత్రలను ప్రజలు స్వాగతిస్తున్నారని నరసరావుపేట నయా నయుం గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని ఓడించి తిన్న ప్రతి ఒక్క రూపాయిని కక్కించే అరవింద బాబును ఎమ్మెల్యేగా చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని డా౹౹చదలవాడ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్ట కిరణ్,నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు షేక్ మాబు,తెలుగు యువత అధికార ప్రతినిధి మొహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ విధానం తప్పని సరి

Satyam NEWS

వైకాపా నేతల కనుసన్నల్లో జూదం మాఫియా

Bhavani

ప్రతీ మహిళల చేతిలో రక్షణ చక్రం “దిశా” యాప్

Satyam NEWS

Leave a Comment