28.2 C
Hyderabad
May 8, 2024 23: 40 PM
Slider విజయనగరం

ప్రతీ మహిళల చేతిలో రక్షణ చక్రం “దిశా” యాప్

#depikaips

మహిళల చేతిలో రక్షణ చక్రం “దిశా (ఎస్.ఓ.ఎస్) యాప్” అని జిల్లా ఎస్పీ ఎం. దీపిక  అన్నారు. ప్రతీ మహిళ తమకు రక్షణగా నిలిచే చట్టాలు గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలు, విద్యార్ధులకు, వారికి రక్షణగా ఉండే చట్టాలు పట్ల, ఆపద సమయంలో పోలీసుల సహాయం పొందే విధానం పట్ల, దిశా యాప్ను వినియోగించి రక్షణ పొందడం పట్ల అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసుశాఖ తరుపున చర్యలు చేపడుతున్నామన్నారు.

ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, మహిళా పోలీసులు (ఎం.ఎస్.పి.లు), మహిళా రక్షక్, ఇతర పోలీసు సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టి తమ పోలీసు స్టేషను పరిధిలోని ముఖ్య కూడళ్లు, ఉన్నత పాఠశాలలు, కళాశాలలను, బస్టాండులు మరియు రైల్వే స్టేషన్ లను సందర్శించి ప్రజలు, మహిళలు, విద్యార్ధినులతో మమేకమై, వారికి అర్ధమయ్యే రీతిలో మహిళల రక్షణకు బాసటగా నిలిచే చట్టాలు పట్ల అవగాహన కల్పించారు. అంతేకాకుండా, మహిళల తమ స్మార్ట్ ఫోన్లులో దిశా ఎస్.ఓ.ఎన్. మొబైల్ యాప్ డౌన్లోడు చేయించి, రిజిస్ట్రేషను చేయించి, యాప్ ను ఎట్టి పరిస్థితుల్లోను డిలీట్ చెయ్యవద్దని కోరారు. యాప్ ను ఏకారణంతోనైనా డిలీట్ చేస్తే, వారు ఆపద సమయంలో ఉన్నపుడు దిశా ఎస్.ఓ.ఎస్. యాప్తో పోలీసుల సహాయం పొందే వెసులుబాటును కోల్పోతారన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు.

మహిళలు రక్షణ, భద్రతకు దిశా యాప్ ఒక సాధనంగా, రక్షణ చక్రంగా ఉపయోగపడుతున్నదని, ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, దిశా ఎస్.ఓ.ఎస్. మొబైల్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడు చేసుకోవాలని జిల్లా ఎస్పీ మహిళలు, విద్యార్ధినులకు పిలుపునిచ్చారు. ఈ రోజు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ లో 3,497 మందితో దిశ ఎస్.ఓ.ఎస్. యాప్ ను డౌన్లోడు, రిజిస్ట్రేషను చేయించామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 7,87,823 మందితో దిశ యాప్ను డౌన్లోడు చేయించగా, 4,59,252మందితో రిజిస్ట్రేషను చేయించామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.

Related posts

వినియోగదారుల చట్టాలపై అవగాహన కార్యక్రమం

Satyam NEWS

పోస్ట్ ప్రొడక్షన్ లో అడుగు పెట్టిన ‘ఎక్కడికో ఈ అడుగు’

Sub Editor

ఇంప్రీచ్ రైట్స్:వ్యక్తి గత స్వేచ్ఛను హరిస్తున్నామీడియా

Satyam NEWS

Leave a Comment