27.7 C
Hyderabad
May 4, 2024 10: 10 AM
Slider మహబూబ్ నగర్

మాజీ జడ్పిటిసి వెంకటయ్య యాదవ్ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం రాస్తారోకో

#tdpwanaparthy

వనపర్తి మునిసిపల్ పరిధిలోని నాగవరం శివారు సర్వే నంబర్ 200లోని గిరిజనుల ఆధీనంలో ఉన్న భూమిని అభివృద్ధి పేరిట లాక్కోవడానికి చేస్తున్న ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. వనపర్తిలో రాస్తా రోకో నిర్వహించారు. 70 ఏండ్లుగా తరతరాలుగా సాగు చేసుకొని జీవనాధారం పొందుతున్న వారికి ప్రత్యామ్నాయం చూపకుండా దౌర్జన్యంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాని ప్రశ్నించిన వెంకటయ్య యాదవ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని నాయకులు బోలేమోని రాములు, నందిమల్ల అశోక్ తెలిపారు.

వెంకటయ్య యాదవ్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అదే విధంగా భూమి పోతుందని  బెంగతో గుండే పోటుతో మరణించిన గిరిజన మహిళ శాంతమ్మ కుటుంబానికి మూడు ఎకరాల భూమి, 2000000రూపాయల ఎక్సగ్రెషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 ఈ కార్యక్రమంలో  తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షుడు బోలేమోని రాములు, పట్టణ అధ్యక్షుడు నందిమల్ల అశోక్,నేతలు రవియాదవ్,ఆవుల శ్రీను,నందిమల్ల.రమేష్, ఖాదర్,కొత్త గొల్ల శంకర్,శివాజీ,చిన్నయ్య యాదవ్,డబ్బా.శ్రీను, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు,న్యాయవాది జగతుపల్లి చవ్వ మోహన్ యాదవ్ పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

వివేకానంద రెడ్డి హత్యలో జగన్ కుటుంబ పాత్ర బట్టబయలు

Satyam NEWS

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా ‘అమిగోస్’.. ఫిబ్రవరి 10న గ్రాండ్ రిలీజ్

Satyam NEWS

వైభవంగా తుంగభద్ర పుష్కర పూజలు ప్రారంభించిన పీఠాధిపతి

Satyam NEWS

Leave a Comment