26.7 C
Hyderabad
April 27, 2024 08: 28 AM
Slider ఆధ్యాత్మికం

వైభవంగా తుంగభద్ర పుష్కర పూజలు ప్రారంభించిన పీఠాధిపతి

#TungabhadraRiver

12 సంవత్సరాలకు ఓసారి వచ్చే పుష్కర పూజలను రాఘవేంద్ర మఠం పీఠాధిపతి సుబుధెంద్ర తీర్థులవారు శుక్రవారం వైభవంగా ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్చారణ నడుమ అశేష భక్త జనం మధ్య ఈ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ దేశంలో ఉన్న పన్నెండు నదులలో తుంగభద్ర నదికి ప్రత్యేక పవిత్రత ఉందని ఆయన తెలిపారు. అదేమనగా దేశంలో 11 నదుల గంగాజలం సముద్రం పాలైతే తుంగభద్ర గంగాజలం మాత్రం కృష్ణానదిలో కలుస్తుంది అని ఆయన తెలిపారు.

నదులన్నీ సముద్రం పాలు అయితే ఒక తుంగభద్ర మాత్రం భక్తజనానికి ఉపయోగపడుతుందని తెలిపారు.

ఇప్పటికే 11 నదుల గంగాజలాన్ని సేకరించిప్రత్యేక పూజలు నిర్వహించి తుంగభద్రా నదిలో సంగమం చేశామని ఆయన తెలిపారు. అంతేగాక భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం కూడా జరిగిందని ఆయన అన్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన భక్తులను కోరారు.

Related posts

విజయనగరంలో ఫ‌స్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌లు…!

Satyam NEWS

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం

Bhavani

లక్ష పత్రి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట

Bhavani

Leave a Comment