27.7 C
Hyderabad
May 4, 2024 10: 37 AM
Slider ఆదిలాబాద్

పిఆర్సి నివేదికలను దహనం చేసిన TUTF ఉపాధ్యాయులు

#PenchikalPet

రాష్ట్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా ముగ్గురు సభ్యులతో పిఆర్సి ఏర్పాటు చేసి సుదీర్ఘకాలం 30 నెలలు తర్వాత ఇచ్చిన నివేదిక ఉద్యోగ ఉపాధ్యాయుల ను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని కొమురం బీం ఆసిఫాబాద్ జిల్లా TUTF ప్రకటించింది.

ఈ నివేదిక అశాస్త్రీయంగా, లోపభూయిష్టంగా, ఉద్యోగ ఉపాధ్యాయులను అవమానాలకు గురి చేసినట్లు గా ఉందని వారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 7.5 శాతం ఫిట్మెంట్ ప్రకటించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంటి అద్దె భారీగా కోత విధించడం అంటే ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం ఆడటమేనని, తెలంగాణ లో మధ్యంతర భృతి లేకుండా ప్రకటించ బోయే మొదటి పిఆర్సి అని, ఇప్పటికీ ప్రతి ఉద్యోగి 1.5 లక్షలు నష్టపోయారని వారన్నారు. పి ఆర్ సి కమిటీ నివేదిక తో సంబంధం లేకుండా భేషరతుగా 63% ప్రకటించాలని ఇంటి అద్దె భత్యం ప్రస్తుతం కంటే పెంచాలని వారు డిమాండ్ చేశారు.

గ్రాట్యుటీ పరిమితి 20 లక్షలకు పెంచాలని TUTF పెంచికల్ పేట మండల కమిటీ డిమాండ్ చేస్తున్నది. చౌరస్తా వద్ద పి ఆర్ సి కమిటీ రిపోర్టు నివేదికలను ఉపాధ్యాయులతో కలిసి దహనం చేశారు.

ఈ కార్యక్రమంలో TUTF జిల్లా  సహా అధ్యక్షుడు భాను ప్రకాశ్, మండల ప్రధాన కార్యదర్శి  గణేష్  గౌరవ అధ్యక్షులు శ్రీధర్ ఉపాద్యాయులు జాఫర్, ప్రశాంత్, రవి ,ముత్యం, సతీష్ విజయ్, కవిత, స్వప్న,లక్ష్మి చందన, భారతి ,ప్రియాంక,  వనిత,భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts

గిరిజన విద్యార్థులకు మంచి ర్యాంకులు రావాలి

Bhavani

ఆఫీసియల్:రాష్ట్రంలో ఒక్క కొవిద్‌-19 కేసు లేదు

Satyam NEWS

ప్రధాని మోడీని హత్య చేస్తానని బెదిరించిన యువకుడి అరెస్టు

Satyam NEWS

Leave a Comment