39.2 C
Hyderabad
April 28, 2024 12: 32 PM
Slider ఖమ్మం

గిరిజన విద్యార్థులకు మంచి ర్యాంకులు రావాలి

#Tribal students

గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో పాసయ్యే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు.ఐటీడీఏ కాన్ఫరెన్స్ హాల్లో గిరిజన సంక్షేమ శాఖ హెచ్ఎంలు ఉపాధ్యాయులతో రాబోయే రోజులలో 10వ తరగతి పరీక్షలపై తీసుకోవలసిన జాగ్రత్తలు పరీక్షలకు సంబంధించిన అంశాల గురించి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థిని విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నారో ముఖ్యంగా గణితం, సామాన్య శాస్త్రం, ఇంగ్లీషుతోపాటు సాంఘిక శాస్త్రం సబ్జెక్టులను పిల్లలు పరీక్షలలో సులభంగా రాయడానికి దానికి సంబంధించిన పాఠ్యాంశాలను పుస్తకం రూపంలో సిద్ధం చేయడం జరిగిందని, పిల్లలు ఎవరు పదో తరగతిలో ఫెయిల్ కాకూడదని త్వరలో సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ శిక్షణ ఇస్తామని ప్రస్తుతం ఉపాధ్యాయులు తయారుచేసిన సబ్జెక్టులకు సంబంధించిన వివరాలను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించిన ప్రతి అంశాన్ని పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఇప్పటినుండే వారికి విద్యా బోధన చేయాలని ,తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ సామాన్య శాస్త్రం కానీ సాంఘిక శాస్త్రం కానీ ఏ అక్షరం తప్పు పోయిన మార్కులు కట్ అవుతాయని అందుకు సంబంధిత ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా విద్యార్థిని విద్యార్థులకు బోధించి 10/10 ర్యాంకులలో పాస్ అవ్వాలని ఆయన ఉపాధ్యాయులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ఏసీఎంవో రమణయ్య సంబంధిత పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Satyam NEWS

హైదరాబాద్లో రెండు భారీ భవనాల కూల్చివేత

Bhavani

అసంఘటిత కార్మికులకు అండగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

Satyam NEWS

Leave a Comment