28.7 C
Hyderabad
May 5, 2024 09: 17 AM
Slider ఖమ్మం

విద్యార్థి ఫెయిల్ అయితే టీచర్ దే బాధ్యత

#bhadradri

విద్యార్ధి పరీక్షలో ఫెయిల్ అయితే అది టీచర్ ఫెయిల్యూర్ గానే పరిగణించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు.  ఐడిఓసి సమావేశపు హాలులో 10వ తరగతి పరీక్షలు, యు డైస్ ప్లస్, ఆధార్ నమోదు, మన ఊరు మన బడి  కార్యక్రమాలపై సెక్టోరల్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు,  తొలిమెట్టు మండల నోడల్ అధికారులు, అన్ని ప్రభుత్వ, లోకల్ బాడీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం 10వ తరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించాలని చెప్పారు. నూరు శాతం ఫలితాలు సాధనకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని  విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం ఫలితాలను బేరీజు వేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని ఎం ఈ ఓలను ఆదేశించారు.  విద్యార్థులకు నమూనా పరీక్షలు నిర్వహించి పరీక్షలంటే బిడియం లేకుండా సన్నద్ధం చేయాలని చెప్పారు.

జిలాల్లో 334 పాఠశాలలకు  చెందిన 6074 మంది బాలురు, 6416 మంది బాలికలు మొత్తం 12490 మంది పరీక్షకు హాజరవుట్జున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 3 వ తేదీ నుండి 13 వ తేదీ వరకు జరుగనున్నాయని చెప్పారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అల్పాహారం అందించుటకు 20 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో 80.8 శాతం ఫలితాలు సాధించామని, ఈ సంవత్సరం నూరు శాతం ఫలితాలు సాధించాలని చెప్పారు.

గత సంవత్సరం నూరు శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులను అభినందించారు. శ్రద్ధ చూపిస్తే ఫలితాలు వస్తాయని, గత సంవత్సరం రాష్ట్ర స్థాయిలో మన జిల్లా 29 వ స్థానంలో నిలిచిందని ఈ దఫా మెరుగైన స్థానం సాధించాలని చెప్పారు. గత సంవత్సరం తక్కువ  ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు  చాలెంజ్ గా తీసుకొని ఈ సంవత్సరం నూటికి నూరు శాతం ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలని ఆయన చెప్పారు. 

10వ తరగతి పరీక్షల్లో భద్రాద్రి జిల్లా టాప్ లో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారని కృషి చేస్తే తప్పక మంచి ఫలితాలు సాధిస్తామని ఆ బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉందని ఆయన పేర్కొన్నారు. పరీక్ష లంటే భయం లేకుండా విద్యార్థులకు ధైర్యాన్ని నింపాలని ఆయన చెప్పారు.  ఉత్తమ ఫలితాలు సాధనకు సిబ్బందితో సమావేశం నిర్వహించి మన పిల్లలాగా  కృషి చేస్తే ఫలితాలు సాధిస్తామని ఆయన పేర్కొన్నారు.

విద్యార్థులకు మంచి జీవితాన్ని ఇవ్వాలంటే ఆ బాధ్యత ఉపాధ్యాయుడు పైన ఉందని ఆయన స్పష్టం చేశారు.  ఈ సందర్భంగా 2005లో తను 10వ తరగతి పరీక్షలకు సన్నద్ధం అయిన  సందర్బాన్ని కలెక్టర్ గుర్తు చేశారు. వ అన్ని పాఠశాల విద్యార్థులు ఆధార్ ఎన్రోల్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలని, విద్యార్థులకు మంచి భోజనం పెట్టాలని చెప్పారు.

ఖచ్చితంగా భోజన ప్రమాణాలను పెంచాలని, తప్పనిసరిగా మెనూ ప్రకారం భోజనం అందించు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తన పర్యటనల్లో పాఠశాలల్లో భోజనం చేస్తానని, లోపాలుంటే ప్రదానోపాధ్యాయులు, ఎంఈఓలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మన ఊరు మనబడి పనుల ప్రగతిని  సమీక్షించిన కలెక్టర్ ఎంపిక చేసిన 46 మోడల్ పాఠశాలలో అన్ని పనులు పూర్తి  చేయాలని చెప్పారు.

ప్రతి పాఠశాలలో గ్రీనరి, లాన్ ఏర్పాటు చేయుటకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు.   మార్చి 25 వరకు నిర్దేశించుకున్న విధంగా అన్ని పాఠశాలలో పనులు పూర్తిచేయు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. పనులు వేగంగా జరిగేందుకు నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు.  మన ఊరు మనబడి పాఠశాలల పనులపై ఈ నెల 28,  మార్చి 15,  25 వరకు జరగాల్సిన పనులపై కార్యచరణ నివేదిక ఇవ్వాలని ఆయన ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. 

యధావిధిగా పనులు జరుగుతున్నాయని  నిర్లక్ష్యం వహిస్తే జాప్యం జరుగుతుందని,  నిరంతర పర్యవేక్షణ చేస్తూ పనుల్లో వేగం పెంచాలని చెప్పారు.  ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్,  మన ఊరు మనబడిపర్యవేక్షణ ఇంజినీరింగ్ అధికారులు,   అన్ని మండలాల ఎంఈవోలు,  ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పోలీస్ ఉద్యోగం లభించడం గొప్ప అవకాశం

Satyam NEWS

INTUC అధ్యక్షురాలిగా చౌడం శివపార్వతి నియామకం

Satyam NEWS

నట రత్నాలు’ ఆడియో ఫంక్షన్‌లో సుమన్‌పై శివనాగు ఫైర్‌!

Bhavani

Leave a Comment