40.2 C
Hyderabad
May 5, 2024 18: 28 PM
Slider నల్గొండ

INTUC అధ్యక్షురాలిగా చౌడం శివపార్వతి నియామకం

#INTUCHujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఐ ఎన్ టి యు సి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో సూర్యాపేట జిల్లా ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ హుజూర్ నగర్ పట్టణ ఐ ఎన్ టి యు సి మహిళా అధ్యక్షురాలిగా చౌడం శివపార్వతిని నియమిస్తూ నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా శివ పార్వతి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు నల్లగొండ జిల్లా పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి,

ఐఎన్ టి యు సి జనరల్ సెక్రెటరీ యరగాని నాగన్న గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు అన్ని వేళలా అండగా ఉంటూ, వారి హక్కులు, సమస్యలపై పోరాటం చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య, మండల INTUC అధ్యక్షుడు మేళ్లచెరువు ముక్కంటి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు చప్పిడి సావిత్రి, కాల్వ పెద్ద వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

లాక్ డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులను రద్దు చేయాలి

Satyam NEWS

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి కార్పొరేషన్ పదవి

Satyam NEWS

శ్రీ రాట్నాలమ్మ ను దర్శించుకున్న పి వి సింధు 

Satyam NEWS

Leave a Comment