19.7 C
Hyderabad
December 2, 2023 05: 22 AM
Slider ఖమ్మం

వైద్య రంగంలో తెలంగాణ నెంబర్ వన్

#medical field

వైద్య, ఆరోగ్య రంగంలో మానవ వనరుల కొరత తీర్చాలని ఉద్దేశ్యంతో ప్రభుత్వం జిల్లాల్లో ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాలల ఏర్పాటు చేస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామంలో నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి శంఖుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ, 5 ఎకరాల్లో రూ. 25 కోట్లతో నర్సింగ్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు, ఒక్క సంవత్సరం లోనే పూర్తిచేసి అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. స్టాఫ్ నర్సులు అంటే ఆసుపత్రుల్లో ఎక్కువగా కేరళ రాష్ట్రం నుండే ఉండేవారని, రాష్ట్రంలో కావాల్సిన మెడికల్, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది వుండే వారు కారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇది గ్రహించి, ప్రతి జిల్లాలో మెడికల్, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటుచేసిందని ఆయన అన్నారు.

త్వరలో జిల్లాలో బిఎస్సి పారా మెడికల్ కళాశాల మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం సీఎం కలల ప్రాజెక్ట్ అని, ఇది పూర్తయితే కాలంతో పనిలేకుండా, సాగర్ లో నీళ్లు రాకపోయినా 2 పంటలకు సాగునీరు అందుతుందని ఆయన అన్నారు. పాలేరు నియోజకవర్గానికి రూ. 125 కోట్ల ఎస్జిఎఫ్ నిధులు మంజూరు అయినట్లు, అట్టి నిధులతో గ్రామ గ్రామానికి సిసి రోడ్స్, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ భవనాలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో డాక్టర్లు, నర్సుల కొరత ఉన్నట్లు, శిక్షణా నర్సులు చాలా తక్కువ అని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మేల్ నర్సింగ్ చేపట్టి, ప్రతి వైద్య కళాశాల కు అనుబంధంగా నర్సింగ్ కళాశాల ఏర్పాటుచేదినట్లు ఆయన అన్నారు. పారా మెడికల్ కోర్సులు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే, తక్కువ ఫీజుతో అవకాశాలు వుంటాయని, పేదవాళ్లకు విద్య అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. నర్సింగ్, ఫిషరీస్, ఇంజనీరింగ్ కళాశాలలతో ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

కార్యక్రమంలో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో విద్యకు సంబంధించి ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు. ఆనాడు చదువుకునే పరిస్థితి కాక చదువు కొనే పరిస్థితి ఉండేదని, నేడు పరిస్థితి మారిందని తెలిపారు. అంగన్వాడీ నుండి ఉన్నత చదువులు అన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. డబ్బు ఎక్కువ ఉందని చదువు ఆపొద్దని, డబ్బు లేదని చదువు ఆపొద్దని ఆయన తెలిపారు.

ప్రతి పిల్లవాడు చదువుకునేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఫిషరీస్, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాలలతో నియోజకవర్గం విద్యారంగంలో మరింత ముందుకు వెళుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర రెడ్డి, తాతా మధుసూదన్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.

వారియర్, జెడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. మాలతి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రత్న కుమారి, ఖమ్మం రూరల్ ఎంపిపి బెల్లం ఉమ, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫలక్ నుమా ప్యాలెస్ సందర్శించిన థాయ్ యువరాణి

Satyam NEWS

వచ్చే ఏడాది విత్తన సరఫరాకు ఏర్పాట్లు ఆరంభం

Satyam NEWS

(2022) Cbd Hemp Store Charleston Sc Portable Cbd Hemp Plant Thc Content Tester

Bhavani

Leave a Comment

error: Content is protected !!