భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక లోని లెనిన్ నగర్ శ్రీరాంపురంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విలేకరులమని చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఉపాధ్యాయురాలు వసుంధర ఫిర్యాదు మేరకు ఇట్టి వ్యక్తులు అయిన వీరబాబు, సత్యనారాయణ, జయబాబు లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బూర్గంపహాడ్ ఎస్ఐ నాగబిక్షం తెలిపారు.
ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడితే ఎంతటి వారినైన ఉపేక్షించేది లేదు అని ఇలాంటి అపరిచిత వ్యక్తులు డబ్బుల వసూళ్లకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని తెలిపారు.