22.2 C
Hyderabad
December 10, 2024 10: 02 AM
Slider ముఖ్యంశాలు

వైద్య కళాశాల ప్రారంభం

#Harish rao

ఖమ్మం లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. 100 సీట్లతో ఈ సంవత్సరం నుండే కళాశాల ప్రారంభం కానున్నట్లు, నేటి నుండి తరగతులు ప్రారంభం కానున్నట్లు వారు తెలిపారు. రూ. 8.5 కోట్లతో పాత కలెక్టరేట్, పౌరసరఫరాలు, గిరిజనాభివృద్ది అధికారి, రోడ్లు భవనాల శాఖల కార్యాలయాలను వైద్య కళాశాల, హాస్టళ్లకు అనుగుణంగా రెనోవేషన్ చేపట్టినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వైద్య కళాశాలలో సమకూర్చిన ల్యాబ్ లు, విద్యార్థులకు హాస్టల్, మౌళిక సదుపాయాల కల్పనలు మంత్రులు పరిశీలించారు. జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసి, తెలంగాణ ప్రాంత పిల్లలకు వైద్య సీట్లు ఎక్కువగా పొంది, మన ప్రాంతం నుండి వైద్యులు ఎక్కువగా తయారవ్వాలని ప్రభుత్వం దృఢసంకల్పంతో తీసుకున్న నిర్ణయమని వారు తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుతో ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలతో వైద్య, ఆరోగ్య రంగాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. బిడ్డ కడుపులో పడగానే, న్యూట్రిషన్ కిట్, ప్రసవం కాగానే కేసీఆర్ కిట్ ను ప్రభుత్వం అందిస్తున్నదని మంత్రి అన్నారు. ఈ పథకాలతో గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం జరిగే ప్రసవాలు, నేడు 76.8 శాతానికి చేరుకున్నాయన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రం సమకూర్చాలని రవాణా శాఖ మంత్రి కోరగా, త్వరలో అందజేయనున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సేవాలు అందజేస్తున్నట్లు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, లోకసభ సభ్యులు నామా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.

వారియర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర రెడ్డి, తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ, జెడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. రాజేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజకీయ కారణాలతో టీచర్‌ను చంపడం దారుణం: చంద్రబాబు

Satyam NEWS

రైతులను దగా చేసే మద్ధతు ధరలు

Bhavani

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడి ఎన్నికపై హైకోర్టు స్టే

Satyam NEWS

Leave a Comment