39.2 C
Hyderabad
May 3, 2024 11: 40 AM
Slider నల్గొండ

మహిళా దినోత్సవ సందర్భంగా కార్మిక మహిళలకు ఘన సన్మానం

#citu

అంతర్జాతీయ మహిళా అభివృద్ధికి పార్లమెంటులో అధికార పార్టీ,ప్రతిపక్ష పార్టీలు మోసం చేశాయని మహిళల రిజర్వేషన్ చట్టం చేయటం పూర్తిగా విఫలం చెందాయని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి ఆరోపించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్లచెరువు మండలం రాంపురంలో కృష్ణపట్టే ఏరియా సిమెంట్ క్లస్టర్ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్ మహిళా కార్మికులకు ఘనంగా శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా శీతల రోషపతి  మాట్లాడుతూ కష్టాన్ని నమ్ముకున్న మహిళలు మన దేశంలో,రాష్ట్రంలో ఉన్నారని వారి అభివృద్ధికి సహకరించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. నిజంగా మహిళలపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రం మొత్తం 80,000 మందికి పైగా పనిచేస్తున్న మిడ్ మీల్స్ కార్మికుల జీతాలు ఇప్పటికి నెలకి వెయ్యి రూపాయలు మాత్రమే ఇవ్వడం దౌర్భాగ్యమని అన్నారు.కేంద్ర ప్రభుత్వం తక్షణమే రిజర్వేషన్ సౌకర్యం కల్పించి రాజకీయాలలో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించాలని కోరారు. మహిళలకు సొంతస్థలం గలవారికి 15 లక్షల రూపాయలు లోన్,డబల్ బెడ్ రూమ్ సౌకర్యం,ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారికి ప్రతి ఒక్కరికీ ఉద్యోగం,ఎడ్యుకేషన్ విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా విద్యార్థులకు ఎల్ కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు తీగల మంగమ్మ,శాంతమ్మ,రమణ, సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు యలక సోమయ్య గౌడ్,సిఐటియు వినాయకుడు,తీగల శ్రీను,షేక్ అజ ముద్దీన్,వీరబాబు,ప్రకాష్,శీను,రామయ్య, సైదేశ్వర రావు,శ్రీను,వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

వేసవి కాలం నీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూస్తా

Satyam NEWS

ఇండియాకు అనువైనది ఆక్సఫర్డ్ వ్యాక్సిన్ మాత్రమే

Satyam NEWS

23 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

Satyam NEWS

Leave a Comment