29.7 C
Hyderabad
May 6, 2024 04: 06 AM
Slider నిజామాబాద్

విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రానిది సక్సెస్ స్టోరీ

#Pocharam Srinivasa Reddy

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ శివారులోని SMB ఫంక్షన్ హాల్ లో జరిగిన “విద్యుత్ ప్రగతి” కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిధిగా

పాల్గొన్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి , జిల్లా రైతుబంధు అధ్యక్షుడు డి అంజిరెడ్డి, బాన్సువాడ పురపాలక సంఘం అధ్యక్షుడు జంగం గంగాధర్, RDO రాజా గౌడ్, DSP జగన్నాధ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బంది, వినియోగదారులు

ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును ప్రజలకు వివరించడానికే ఈ దశాబ్ధి అవతరణ ఉత్సవాలు. విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రానిది సక్సెస్ స్టోరీ. అంధకారం నుండి వెలుగు లోకి వచ్చింది. ఆధునిక కాలంలో విద్యుత్తు మానవ జీవితాలతో ముడిపడి

ఉన్నది. పొద్దున్న నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు అన్ని అవసరాలకు కరంట్ అవసరం. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు కరంటే ముఖ్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 లో మన సామర్థ్యం 7,778 మెగావాట్లు. లోటు 2700 మెగావాట్లుగా ఉండేది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, పట్టుదల, ప్రణాళికలతో ఉత్పత్తి సామర్థ్యం 2023 నాటికి

18, 567 మెగావాట్లకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 తరువాత రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థల పటిష్టం, విస్తరణకు 97, 321 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. గృహ,వ్యవసాయ రంగాలకు సబ్సిడీలకు రూ. 50,000 కోట్ల ఖర్చు అయింది. విద్యుత్తు కావలసినంత అందుబాటులో ఉండడంతో గృహాలకు, వ్యవసాయానికి,

పారిశ్రామిక రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా అవుతుంది. 2014 లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1196 యూనిట్లు. ఈరోజు రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2140 యూనిట్లకు చేరింది. ఇది జాతీయ సగటు 1255 యూనిట్ల కంటే 70 శాతం అధికం. రైతులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయానికి ఉచితంగా కరంటు సరఫరా జరుగుతుంది.

ప్రధానమంత్రి స్వంత రాష్ట్రం గుజరాత్ లో కూడా ఉచిత విద్యుత్ లేదు. పైగా మోటార్లకు మీటర్లు పెట్టారు. మన రాష్ట్రంలో కూడా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే FRMB కింద ఏటా 6000 కోట్ల రుణం ఇస్తామని కేంద్రం లెటర్ పంపింది. కానీ ఎంత నష్టం వచ్చిన, మీరు రుణం ఇవ్వకపోయినా పర్వాలేదు నేను మాత్రం మోటార్లకు మీటర్లు పెట్టనని

కేసీఆర్ దైర్యంగా చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 27.49 లక్షల వ్యవసాయ కరంటు మోటార్లు ఉన్నాయి. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కోసం ఏటా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అంటే ప్రతి రైతుకు రూ. 40,000 సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది. బాన్సువాడ నియోజకవర్గంలో విద్యుత్ సబ్ స్టేషన్లు, సరఫరా కోసం 525 కోట్లు ఖర్చు చేశాం.

దామరంచలో 70 కోట్ల రూపాయలతో 220 KV సబ్ స్టేషన్ ఏర్పాటు చేశాం. నియోజకవర్గంలో 43,000 విద్యుత్ మోటార్లు ఉన్నాయి. వీటి కోసం ఏటా సుమారుగా రూ. 170 కోట్ల సబ్సిడీగా ఖర్చు అవుతుంది. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను సర్పంచ్ లు ఫోటోలు, వీడియోలు తీసి ప్రజలకు వివరించాలి అని ఆయన కోరారు.

Related posts

కరోనా మృతులను కొయ్యడలో దహనం చేయడం ఆపాలి

Satyam NEWS

ములుగు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

Satyam NEWS

సమంత డాక్టర్‌ను దగ్గర పెట్టుకుని డబ్బింగ్ చెప్పారు…..

Satyam NEWS

Leave a Comment