33.2 C
Hyderabad
May 11, 2024 13: 19 PM
Slider వరంగల్

తెలంగాణ సామాజిక రచయితల మాతృభాష దినోత్సవం

#GiduguRammurthy

మాతృభాషా ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటిన ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రాంమూర్తి తెలుగు ప్రజలకు మార్గదర్శక మని  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొగుళ్ళ భద్రయ్య అన్నారు.

తెలంగాణ సామాజిక రచయితల సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు కొండ్లే  శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం మొగుళ్ల భద్రయ్య, కొండ్లే శ్రీనివాస్ లు మాట్లాడుతూ తెలుగుభాష గొప్పతనం ఎంత మధురంగా ఉంటుందో నలుదిశలా చాటి మాతృభాషకు వన్నెతెచ్చిన గిడుగు మహానీయుడని అన్నారు.

నేటి సమాజం గిడుగును ఆదర్శంగా తీసుకుని మాతృభాష పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని అన్నారు. రచయితలు తెలుగు భాష మరుగునపడి పోకుండా రచనలు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు బైకాని రాజు, అక్షరజ్యోతి ఫౌండేషన్ కోశాధికారి చల్లగురుగుల రాజు,తె.సా.ర.సం రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు సంద బాబు,గుడికందుల కృష్ణలు పాల్గొన్నారు.   

Related posts

సహకార అవినీతిపై 19న వనపర్తిలో బిజెపి ధర్నా

Bhavani

పాకిస్తాన్ సెనేట్ లో వీగిపోయిన మనీ లాండరింగ్ బిల్లు

Satyam NEWS

త్రికోటేశ్వరనమహ: చేదుకో కోటయ్య ఆదుకో మమ్ము

Satyam NEWS

Leave a Comment