30.7 C
Hyderabad
April 29, 2024 06: 45 AM
Slider మహబూబ్ నగర్

సహకార అవినీతిపై 19న వనపర్తిలో బిజెపి ధర్నా

#BJP dharna

వనపర్తి జిల్లా కేంద్రంలో సహకార బ్యాంకు దుకాణాల అద్దె అవినీతిపై ఈనెల 19వ తేదీన అవినీతి అక్రమాల కోఆపరేటివ్ షాపింగ్ కాంప్లెక్స్ ముందు ధర్నా చేస్తామని నాయకులు తెలిపారు. వనపర్తి మండల బిజెపి శాఖ తరపున ఆందోళనకు పిలుపునిచ్చామన్నారు.

వనపర్తి జిల్లా బిజెపి కార్యాలయంలో వనపర్తి మండల బిజెపి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత కందిరీగ తండా గ్రామ సర్పంచ్ – మండల బిజెపి అధ్యక్షుడు దేవేందర్ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు సీతారాములు హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మండల ఇన్చార్జి రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు బి. కృష్ణ, రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యుడు సబ్బిరెడ్డి వెంకటరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, అధికార ప్రతినిధి బచ్చు రాము, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గౌడ్, మండల బిజెపి ప్రధాన కార్యదర్శులు బూతు కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వనపర్తి మండలంలో పార్టీ సమస్తాగతంగా అభివృద్ధి చెందాలని ప్రతి బూత్ కమిటీని వెంటనే పూర్తి చేయాలని ఇల్లు నిర్మాణానికి బేస్మెంట్ ఎలాంటిదో పార్టీ నిర్మాణానికి బూత్ కమిటీ అలాంటివని అన్ని మోర్చా కమిటీలు పూర్తి చేయాలని మండల కార్యవర్గంలో తీర్మానించారు. వనపర్తి మండలం సింగిల్ విండో షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి కిరాయి వసుళ్ళలో అనేక సంవత్సరాల పాటు లక్షలాది రూపాయలు అవినీతి జరిగిందని విచారణ చేసి సంబంధిత అధికారులను సింగిల్ విండో పాలకవర్గాలను రద్దు చేయాలని వనపర్తి డిమాండ్ చేశారు.

వనపర్తి నడిబొడ్డున సహకార కేంద్ర షాపింగ్ కాంప్లెక్స్ లో కిరాయి వసూళ్లలో అనేక సంవత్సరాలు అవినీతికి పాల్పడుతున్నరని, సహకార మంత్రిగా ఉంటూ నిరంజన్ రెడ్డి నిశ్శబ్దంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అవినీతికి పాల్పడిన సింగిల్ విండో కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ పదివేల కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునర్ ప్రారంభించారని, తెలంగాణ రైతాంగానికి అదృష్టంగా భావిస్తున్నామని, గతంలో సరైన సమయంలో పంటలకు ఎరువులు దొరకక అనేక ఇబ్బందులు గురయ్యారని గత పాలకులు బ్లాక్లో ఎరువుల బస్తాలు అమ్ముకోవడం వల్ల రైతాంగానికి తీరని నష్టం జరిగిందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చాక బ్లాక్ దంధా లేకుండా నిజాయితీ పరిపాలన వ్యవసాయదారులకు సరిపడా ఎరువులతో పాటు పెట్టుబడి సాయం కోసం సబ్సిడీ వేల రూపాయలు రైతులకు అందచేస్తున్నారని తెలిపారు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిది కింద తెలంగాణ రాష్ట్రం రైతంగంతో పాటు దేశవ్యాప్తంగా పెట్టుబడి సహాయం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బిందువు సిద్ధానికి పరికరాలకు 70 శాతం సబ్సిడీని ఎత్తివేసిందని తీవ్రంగా రైతంగం ఇబ్బందుల ఫాల వుతున్నారన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ
సీనియర్ విలేకరి
సత్యం న్యూస్ నెట్

Related posts

అమరవీరుల ఆశయాల కొనసాగింపులో భాగంగా ఉద్యోగుల నోటిఫికేషన్

Satyam NEWS

రైతులను దగా చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Satyam NEWS

రైట్ టైమ్ లో రిలీజవుతున్న ‘రాంగ్ స్వైప్’

Satyam NEWS

Leave a Comment