30.7 C
Hyderabad
May 5, 2024 05: 30 AM
Slider కడప

గండికోట రిజర్వాయర్ నిర్వాసితుల ఆందోళన

#GondikotaResevoier

కడప జిల్లా తాళ్ల ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. గండికోట రిజర్వాయర్ లో 23 టీఎంసీల నీరు నిల్వ ఉంచి, ముంపు గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దాంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వాసితులను ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలంటూ అధికారుల ఒత్తిడి తీసుకువచ్చారు. ముంపు గ్రామాల్లో మకాం వేసి గ్రామస్తులను రెవిన్యూ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

పరిహారం అందించాకే ఇళ్లు ఖాళీ చేస్తామంటూ నిర్వాసితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ప్రమేయంతో నిర్వాసితులను  ఖాళీ చేయించే యత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

అధికారులు, పోలీసులను అడ్డుకుని నిర్వాసితులు వాగ్వివాదానికి దిగారు. పరిహారం పూర్తిగా చెల్లించాకే ఖాళీ చేస్తామని వారు అంటున్నారు.

Related posts

అమరావతి ఉద్యమం: సీఎం ఇంటికి సెక్యూరిటీ పెంచిన పోలీసులు

Satyam NEWS

చతుర్వేదసారం

Satyam NEWS

పోరుమామళ్ల వద్ద 23ఎర్రచందనం దుంగలతో 5గురు అరెస్టు

Satyam NEWS

Leave a Comment