37.2 C
Hyderabad
May 6, 2024 19: 58 PM
Slider నిజామాబాద్

ట్విట్టర్ టిల్లు పది నిమిషాల్లో స్పందించాలి

ముదిగొండ డిఎస్పీ పరిస్థితే ఇక్కడ వచ్చేలా ఉంది:దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై ట్విట్టర్ టిల్లు, మంత్రి కేటీఆర్ పది నిమిషాల్లో స్పందించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. గతంలో ఖమ్మం జిల్లా ముదిగొండలో ఇలాగే రైతులు ఆందోళన చేస్తే అక్కడి డిఎస్పీ వెంకట్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించి ఫైరింగ్ చేస్తే 9 మంది రైతులు చనిపోయారన్నారు.

ఇప్పుడు ఆ డిఎస్పీ పరిస్థితి ఏమైందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని పోలీసులకు గుర్తు చేశారు. ఇక్కడ రైతులు ఆందోళన చేస్తే డిఎస్పీ, ఏఎస్పీలు వచ్చి రైతులను బెదిరిస్తున్నారని, దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వారికి కూడా ముదిగొండ డిఎస్పీ గతే పడుతుందని హెచ్చరించారు. ఇలాంటివి చాలా చూశామని, వేలు పెట్టి చూపిస్తే తాము భయపడే పరిస్థితి లేదన్నారు. నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తే ఇక్కడి నాయకులు స్పందించడం లేదన్నారు.

కనీసం మంత్రి కేటీఆర్ అయినా స్పందించాలన్నారు. మీరు ఎక్కడో కూర్చుని మాట్లాడితే సరిపోదని, 2500 ఎకరాల రైతులకు సంబంధించిన ఇండస్ట్రియల్ భూమి రైతులకే వదిలేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. పఠాన్ చెరువు లాంటి ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ కంపెనీలు మూతపడితే వాటిని మీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి కమర్షియల్ చేసి రెసిడెన్షియల్ గా మారిస్తే ఆ ఫైల్ మీద కేటీఆర్ సంతకం పెట్టాడో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు పంటలు పండించే భూములను ఇండస్ట్రియల్ జోన్ లోకి తీసుకుంటే రైతులకు బాధ ఉండదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ధర్నాకు ఒకే ఒక జెండాపై వచ్చారు తప్ప రాజకీయ కండువాలు కప్పుకొని రాలేదన్నారు. గత ఎన్నికలకు ముందు మీ నాయిన నిజామాబాద్ రైతులతో గోక్కుంటే ఏమైందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని సూచించారు.

ఈరోజు నిజామాబాద్ లో బతుకమ్మ ఆడాల్సిన మీ చెల్లె (ఎమ్మెల్సీ కవిత) ఇప్పుడు ఎక్కడ ఆడుతుందో గుర్తు చేసుకోవాలన్నారు. నిజామాబాద్ రైతులు ఏ రకంగా బుద్ది చెప్పారో ఆకుపచ్చ కండువా కప్పుకున్న కామారెడ్డి రైతులు బుద్ది చెప్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ ఉద్యమాన్ని రాజకీయ పార్టీలకు ఆపాదించవద్దని కేటీఆర్ కు సూచించారు. డిఎస్పీ, ఏఎస్పీలు కలెక్టర్ ను భారీ బందోబస్తు మధ్య మా దగ్గరికి తీసుకువచ్చి వినతిపత్రం తీసుకునేలా చూడాలని కోరారు.

కలెక్టరేట్ లో మళ్ళీ ఉద్రిక్తత

కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు ఇచ్చిన మూడు గంటల సమయం ముగియడంతో కలెక్టరేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు రైతులు ఒక్కసారిగా దూసుకువచ్చారు. ఈ క్రమంలో పోలీసులకు రైతులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు రైతులను మెడపట్టి తోసేశారు.

మహిళా రైతులను మహిళా పోలీసులు లాగి పడేసారు. దాంతో ఆగ్రహానికి గురైన రైతులు కలెక్టరేట్ గేటును బడ్డలుగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా లోపల పోలీసులు ముళ్ళకంచే ఏర్పాటు చేసారు. ఈ క్రమంలో కొందరు రైతుల చొక్కాలు చినిగిపోగా సంతోష్ అనే రైతు కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. మరొక రైతు స్వామి, మహిళా రైతు స్రవంతి స్పృహతప్పి పడిపోయారు. దాంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Related posts

తెలంగాణ రాష్ట్రం లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

Bhavani

ఏపి, తెలంగాణ సీఎంల మధ్య రహస్య ఒప్పందం

Satyam NEWS

పేదరికం లేని భారత దేశం మన స్వప్నం

Satyam NEWS

Leave a Comment