36.2 C
Hyderabad
May 12, 2024 15: 46 PM
Slider రంగారెడ్డి

మున్నూరు కాపు సంఘం కాలమాని ఆవిష్కరణ

#Kapu Sangam

సంఘటితంగా సమైక్యంగా మున్నూరు కాపులు ముందుకు సాగాలని ఉప్పల్ నియోజక వర్గం కన్వీనర్ గంథం నాగేశ్వర రావు పటేల్ స్పష్టం చేశారు. గురువారం గంథం నాగేశ్వర రావు పటేల్ ఆధ్వర్యములో ఉప్పల్ నియోజక వర్గం కాలమాని ఆవిష్కరణ హప్సిగుడా లోనీ సుప్రభాత్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలు గా రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ పటేల్,నగర మాజీ మేయర్ బొంతు రాంమోహన్ పటేల్ పాల్గొన్నారు.

మహిళ అభివృద్ధి డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్పర్సన్,మహిళ సంఘం గౌరవ అధ్యక్షురాలు ఆకుల లలిత పటేల్ మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం లో మహిళలను పెద్ద ఎత్తున కూడా వారి అభివృద్ధి సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. నగర మాజీ మేయర్ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బొంతు రామ్మోహన్ పటేల్ మాట్లాడుతూ ఉప్పల్ నియోజక వర్గంలోని మున్నూరు కాపులు తూర్పు కాపులు కాపులు సంఘటితంగా ఒక్కటి కావాలని సూచిస్తూ కుల అభి మానముండాలి కానీ కుల ద్వేష ఉండవద్దు అని సమాజంలోని అన్ని కులాలతో సఖ్యతగా ఉంటు కుల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేయాలని కోరారు.

మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పటేల్ మాట్లాడుతూ ఇటువంటి చక్కని కార్యక్రమాలతో కుల ఐక్యత సంఘటిత శక్తి బయటపడుతుంది అన్నారు. మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర మాజీ కన్వీనర్ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు సర్దార్ పూటం పురుషోత్తమ రావు పటేల్ మాట్లాడుతూ మున్నూరు కాపులు అంతిమ లక్ష్యం రాజకీయ అధికారం కొరకు కృషి చేయాలని ఆ దిశలో కార్యక్రమాలు కొనసాగాలని మున్నూరు కాపులకు పిలుపు ఇచ్చారు.

కార్యక్రమములో నగర అధ్యక్షులు ఆర్ వి మహేంద్ర పటేల్, బండి పద్మ పటేల్,ఎడ్ల రవి పటేల్,బండారి లత పటేల్,జెల్లీ మోహన్ పటేల్, డివిజన్ అధ్యక్షులు తిప్పిరి రాజు పటేల్,గాదె సత్యనారాయణ పటేల్, వెలుపుల శ్రీనివాస్ పటేల్,రెడ్డి శ్రీనివాస్ పటేల్,కందులు లక్ష్మి నారాయణ పటేల్,సత్తయ్య పటేల్,నవీన్ పటేల్, రాజు పటేల్ తదితరులు పాల్గొని ఉప్పల్ నియోజక వర్గం కాలమనితో పాటు నాచారం డివిజన్ హెచ్ బీ కాలమానిలను ఆవిష్కరించారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

త్వరలో ఆన్‌లైన్ ద్వారా ఆనందయ్య మందు పంపిణీ

Satyam NEWS

పాతిక కేజీల బియ్యం కాదు…పాతికేళ్ల‌ యువత భవిష్యత్తు కోసం జనసేన పార్టీ

Satyam NEWS

ఈ సారి కూడా పైడితల్లి పండగకు వీఐపీ పాస్ లు ఉండవు

Satyam NEWS

Leave a Comment