42.2 C
Hyderabad
May 3, 2024 18: 50 PM
Slider కృష్ణ

తీస్తా సెతల్వాద్ అరెస్టు పౌర సమాజంపై క్రూరమైన దాడి

#testasetlwad

మానవ హక్కుల రక్షణకు బలమైన స్వరమైన తీస్తా సెతల్వాద్ అరెస్టు పౌర సమాజంపై క్రూరమైన దాడి అని, ఆమెను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలనీ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా డిమాండ్ చేసారు.

భారత రాజ్యాంగం ప్రకారం పౌరులకు హామీ ఇచ్చిన హక్కులు మరియు స్వేచ్ఛలను తీవ్రంగా ఉల్లంఘిస్తూ, ఈడి,ఎన్ఐఏ, సిబిఐ యంత్రాంగాలను దూకుడుగా దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్య భావాలు కలిగి ప్రశ్నించే పౌరులందరిపై నిరంకుశ మోడీ ప్రభుత్వం తప్పుడు మరియు నకిలీ కేసులు బనాయిస్తుందని అయన మండిపడ్డారు.

పౌర హక్కుల కార్యకర్త, ప్రముఖ జర్నలిస్ట్ తీస్తా సెతల్వాద్, మాజీ డీజీపీ  ఆర్.బి. శ్రీ కుమార్, సంజీవ్ భట్ ల  అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ హైదరాబాద్, నారాయణగూడ, వైఏంసిఏ కూడలిలో మంగళవారం భారత కమ్యూనిస్ట్ పార్టీ హైదరాబాద్ జిల్లా సమితి ప్రదర్శన నిర్వహించింది.

ఈ ప్రదర్శనకు సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి. నరసింహ నేతృత్వం వహించగా వందలాదిమంది సిపిఐ నాయకులూ, కార్యకర్తలు పాల్గొని ప్లకార్డులు చేతబూని తీస్తా సెతల్వాద్ అరెస్ట్ చట్టవిరుద్ధం, తక్షణమే విడుదల చేయాలి, మోడీ షా డౌన్ డౌన్ అని పెద్దఎత్తున నినాదాలు చేసారు.

ఈ సందర్బంగా అజీజ్ పాషా మాట్లాడుతూ రాజ్యాంగ విలువల కోసం, హక్కుల కోసం పోరాడే తీస్తా సెతల్వాద్, ఆర్.బి. శ్రీ కుమార్ లాంటి అమాయకులపై తప్పుడు కేసులు పెట్టడం అపహాస్యం తప్ప మరొకటికాదన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ కూడా ఈ అరెస్టులను ఖండించడం మోడీ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు.

అనేక మంది న్యాయ నిపుణులు మరియు మేధావులు కూడా ఎమర్జెన్సీ యొక్క చీకటి మేఘాలు హోరిజోన్‌లో మళ్లీ కనిపిస్తున్నాయని ఆందోనళ వ్యక్తం చేస్తున్నారన్నారు. మానవ హక్కుల రక్షణలో ప్రపంచంలోని 37 దేశాల కంటే భారత దేశం చాలా వెనుకబడి ఉందని, ఉన్న 13 ప్రాథమిక మానవ హక్కులలో 12 నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అయన ఆరోపించారు.

453 పేజీల తీర్పులో, శాంతిభద్రతల వైఫల్యం మరియు గుజరాత్ పరిపాలన యొక్క అసమర్థతపై సుప్రీం కోర్టు దృష్టి సారించిన విషయాన్నీ కేంద్ర మరియు గుజరాత్ ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని అజీజ్ పాషా తెలిపారు. ఈ.టి. నరసింహ మాట్లాడుతూ గుజరాత్ ప్రభుత్వం మానవ  హక్కుల పరిరక్షకురాలు తీస్తా సెతల్వాద్ ను అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధం అని తెలిపారు.

మానవ హక్కులను రక్షించడం నేరం కాదని, ప్రశ్నించేందుకు ధైర్యం చేసే వారిపై ఇది ప్రత్యక్ష ప్రతీకార చేర్య అని మండిపడ్డారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం భిన్నాభిప్రాయాలను, విమర్శలను అనుమతిస్తుందని, కానీ కేంద్రంలోని నియంతృత్వ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ  రాజ్యాంగం కల్పించిన ప్రజల హక్కులను అణిచివేస్తూ ప్రశ్నించే గొంతులను కొస్తుందని దుయ్యబట్టారు.

తీస్తా సెతల్వాద్ ను వెంటనే విడుదల చేయాలని, తప్పుడు ఆరోపణలను, కేసులను ఉపసంహరించుకోవాలని ఈ.టి. నరసింహ  డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శనలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఏం. నరసింహ, ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయకులూ బి. స్టాలిన్, భారత జాతీయ మహిళా సమాఖ్య హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు కె. కృష్ణ కుమారి, ఇన్సాఫ్ రాష్ట్ర కార్యదర్శి మునీర్ పటేల్, , రాష్ట్ర నాయకులూ కంపల్లి శ్రీనివాస్, దళిత హక్కుల పోరాట సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల రాజ్ కుమార్, ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్లేకంటి శ్రీకాంత్, సిపిఐ హైదరాబాద్ జిల్లా నేతలు నదీమ్, ఖలీలుల్లా,శంషోద్దీన్, మహమూద్,.మహబూబ్, పర్వీన్ బేగం, యూసుఫ్ బాబా తదితరులు పాల్గొన్నారు.

Related posts

పనిమనిషిని కొట్టినందుకు 16 వారాల జైలు

Satyam NEWS

సమాచార శాఖ ఎపిఆర్వో ప్రభాకర్ కామ లీలలు

Satyam NEWS

లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ థ్రిల్లర్ “చిత్రలేఖ” ప్రారంభం

Bhavani

Leave a Comment