38.2 C
Hyderabad
May 2, 2024 19: 19 PM
Slider వరంగల్

జూలై 2న జాతీయ రహదారి దిగ్బంధానికి MRPS పిలుపు

#mrps

వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ నిర్వహించుకుంటున్న జాతీయ సమావేశాలను అడ్డుకోవడానికి జాతీయ రహదారి దిగ్బంధానికి ఎంఆర్ పిఎస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు మాదిగలను చైతన్య పరిచేందుకు తలపెట్టిన ఎంఆర్ పిఎస్ ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ తడ్వాయి మండలం  బిరేల్లీ  గ్రామం నుండి మహా పాదయాత్ర ప్రారంభించింది. 9 రోజుల అనంతరం ములుగు మండలo బంజరుపల్లి కి మాదిగల పాదయాత్ర చేరుకున్నది.

BC కాలనీ మీదుగా బరి గలపల్లి ఇంచర్ల జంగాలపల్లి క్రాస్ గ్రామాల గుండా బంజేరుపల్లి గ్రామానికి చేరుకున్నారు. ములుగు జిల్లా మాదిగల మహా సంగ్రామం పాద  యాత్ర  MRPS ములుగు మండల కన్వీనర్ కనకం దాస్, MSP ములుగు టౌన్ అధ్యక్షులు మరటి రవీందర్ ల ఆధ్వర్యంలో కొనసాగింది.

గ్రామాలలో మహజనులను మాదిగ లను ఉద్దెశించి   ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక  అధ్యక్షులు ముంజాల బిక్షపతి గౌడ్, మహాజన  సోషలిస్ట్ పార్టీ ములుగు నియోజకవర్గ కో ఆర్టినేటర్ జన్ను రవి మాదిగ లు మాట్లాడారు. వర్గీకరణ ను వ్యతిరేకిస్తున్న బిజెపి జాతీయ సమావేశాలు నిర్వహించేందుకు అడ్డంకులు సృష్టించాలని వారు పిలుపునిచ్చారు.

అందుకే వచ్చే నెల జులై 2, 3 తారీకులలో ములుగు జిల్లా కేంద్రంలో  గట్టమ్మ పల్లి (ప్రేమ్ నగర్) లో  జాతీయ రహదారి  దిగ్బంధ కార్యక్రమం లో జిల్లా నుండి వేలాదిగా మహాజనులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాదయాత్రలో ఎమ్మార్పీఎస్ జాతీయ సీనియర్ నాయకులు  నెమలి నర్సయ్యమాదిగ, జిల్లా కన్వీనర్ పుల్లూరి కర్ణాకర్ మాదిగ బంజరు పల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ బలుగురి ఆయిలక్కమాదిగ మాదిగ కుల పెద్ద మనిషి తప్పెట్ల రఘుపతిమాదిగ ఎమ్మార్పీఎస్ ములుగు జిల్లా నాయకులు పారునందుల శ్రీనివాస్ బలుగురి భద్రయ్య మట్టెవాడ భద్రయ్య(బరి గలపల్లి ) కోడిపుంజుల రమేష్ కొంక రెక్కల శంకర్(ఇంచర్ల) దర్శనాల సత్యం మట్టెవాడ రామస్వామి కొడాలి ఐలయ్య ఖండే సంజీవ(బంజరు పల్లి) మట్టెవాడ శ్రీను గ్రామస్తులు మహిళలు వందలాది మంది మహాజనులు పాల్గొన్నారు.

Related posts

భార్యాభర్త ఆత్మహత్యకు కారణమైన బోరుబావి వివాదం

Satyam NEWS

రాత్రి కి రాత్రే మరో మార్వాడీ దుకాణదారుడు జంప్

Satyam NEWS

తాజ్‌మహల్‌ను తాకిన యమన

Bhavani

Leave a Comment