39.2 C
Hyderabad
May 4, 2024 23: 04 PM
Slider నల్గొండ

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ కి కృతజ్ఞతలు

#congress


హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలచే తెలంగాణ తల్లిగా అభినందనలు అందుకుంటున్న మాజీ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కి నల్గొండ పార్లమెంట్

సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు అధ్యక్షతన సోనియా గాంధీ చిత్రపటానికి

పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యుడు యరగాని నాగన్న గౌడ్,పిసిసి ప్రతినిధి దొంగరి వెంకటేశ్వర్లు,కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు

బాచిమంచి గిరిబాబు,కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు,ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లయ్య,యడవల్లి వీరబాబు, నియోజకవర్గ మైనారిటీ వర్కింగ్ అధ్యక్షుడు షేక్.సైదా,బూత్ కమిటీ అధ్యక్షులు బుల్లెద్దు జైలు,వల్లపు దాసు

కృష్ణ,కోళ్లపూడి యోహాన్,మేళ్ళచెరువు ముక్కంటి,పోతనబోయిన రామ్మూర్తి, చింతకాయల రాము,సులువా చంద్రశేఖర్, పల్లపు వెంకటేశ్వర్లు,ఎస్.కె.ఉద్దండు, పోతుల జ్ఞానయ్య,అంజనపల్లి సుదర్శన్, బొల్లెద్దు కార్తీక్,చిలకబత్తిని జయరాజు,

దాసరి రాములు,పాలకూరి లాలు, తదితరులు పాల్గొని సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి,సోనియా గాంధీ దయ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి

కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చుటానికి నాటి యూపీఐ చైర్ పర్సన్ హోదాలో తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించారని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియాగాంధీ చేసిన కృషికి నిదర్శనంగా కృతజ్ఞతా

భావంతో తెలంగాణ ప్రజలందరూ ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించాలని,సోనియా గాంధీ దయవల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కలవకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందని,తెలంగాణ ఏర్పాటు కోసం సకల జనుల సమ్మెలో

పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని, తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమౌతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తలు,అభిమానులు, సానుభూతి పరులు పెక్కు సంఖ్యలో పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి
హుజూర్ నగర్

Related posts

Analysis: కుల రాజకీయాల బీహారం ఎవరికో

Satyam NEWS

అచ్చేదిన్ అంటే ఇదేనా ? అధిక ధరలతో ప్రజలు చస్తుంటే…

Satyam NEWS

శంక‌ర‌మ‌ఠంలో త్యాగ‌రాజ‌స్వామి ఆరాధనా ఉత్స‌వాలు

Satyam NEWS

Leave a Comment