28.7 C
Hyderabad
April 27, 2024 06: 52 AM
Slider నల్గొండ

అచ్చేదిన్ అంటే ఇదేనా ? అధిక ధరలతో ప్రజలు చస్తుంటే…

#congres hujurnagar

ఏడేళ్ల క్రితం దేశం అభివృద్ధి పథంలో పయనించి ప్రపంచంలో ఒక ఆదర్శవంతమైన ఆర్థిక దేశంగా ఎదిగిన క్రమంలో నరేంద్ర మోడీ పాలన ఈ దేశాన్ని ప్రపంచంలో పేద దేశంలో ఒక దేశంగా నిలిచిందని TPCC జాయింట్ సెక్రటరీ MD అజీజ్ పాషా అన్నారు.

పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను సత్వరమే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. TPCC అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంటు సభ్యుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి  పిలుపు మేరకు ఈ నెల 11వ తేదీన పెట్రోల్ బంకుల ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రకటించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో బుధవారం అజీజ్ పాషా మాట్లాడుతూ నరేంద్ర మోడీ చేసిందేమీ లేదని అన్నారు. మోడీజీ అచ్చేదిన్ ఆయేగా అన్నారు గాని, ఇప్పుడు అలా లేదు సరికదా సచ్చేదిన్ ఆయేగా అన్నట్టు ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అరవై సంవత్సరాలు పరిపాలిస్తే రూ.60 రూపాయలు పెట్రోలు ధరలు దాటలేదని,  కానీ నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఏడేళ్లలో పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.

దిగజారిపోయిన ఆర్థిక పరిస్థితి, విపరీతమైన నిరుద్యోగ రేటు,  వ్యవసాయం విషయంలో నిర్లక్ష్యం, ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తానన్న హామీలు,జీఎస్టీ అమలు,రెండు కోట్ల ఉద్యోగాలు ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో నరేంద్ర మోడీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని ధ్వజమెత్తారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు SK. బిక్కన్ సాహెబ్,కోల మట్టయ్య,కస్తాల ముత్తయ్య,దొంతగాని జగన్.S.సుబ్బరాజు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా కోడి రామ్మూర్తి నాయుడు స్మారక దినోత్సవ వేడుకలు

Satyam NEWS

సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన ఈటల జమున

Satyam NEWS

నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు

Bhavani

Leave a Comment