28.2 C
Hyderabad
April 30, 2025 05: 19 AM
Slider గుంటూరు

ఆర్మీ జవాన్ కి ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ భూమిని మింగేశారు

#MLA Gopireddy Srinivasa Reddy

పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతికి అంతులేదు భూకబ్జాలకు హద్దులేదని నాడు నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి భూకబ్జాల పై ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అనుచరులు నరసరావుపేటలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటుంటే పల్నాడు జిల్లా కలెక్టర్ ఆర్ డిఓ,ఎమ్మార్వో,నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కబంధహస్తాల్లో ప్రభుత్వ భూమి చర చిక్కి కామదేనువుగా మారిందన్నారు.

చిలకలూరిపేట రోడ్డులో ఆర్మీ జవాన్ కి ఇచ్చిన రెండు ఎకరాల భూమి సర్వే నెంబర్ 225-బి ప్రభుత్వ భూమిని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు ప్రైవేటు భూమిగా దొంగ పత్రాలు సృష్టించి వెంచర్లు వేసి ఎకరం ఐదు కోట్ల చొప్పున రెండు ఎకరాలు 10 కోట్లు ఆమ్ముకున్నారన్నారు. కలెక్టర్,ఎమ్మార్వో,ఆర్డీవోలు ఎమ్మెల్యే గోపిరెడ్డి భూకబ్జాల పై ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

నరసరావుపేట వేణుగోపాలస్వామి దేవాదాయ భూమి 4.25 సెంట్ల భూమిని ఆక్రమించి లేఅవుట్లు వేశారని ఎమ్మెల్యే డైరెక్షన్లో ప్లాట్ల రూపంలో అనుచరులు అమ్ముకుంటున్నారని అన్నారు. నరసరావుపేట ఈ నాలుగు సంవత్సరాలలో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఐదు కోట్ల చొప్పున అమ్ముకోని నరసరావుపేట భూ బకాసురుడిగా ఎమ్మెల్యే గోపిరెడ్డి తయారయ్యారని డా౹౹చదలవాడ అరవింద బాబు మండిపడ్డారు.

ప్రభుత్వ భూమిని అమ్ముకొని వెయ్యి కోట్లు,నాలుగు సంవత్సరాలలో లక్ష ట్రక్కులు మట్టి అమ్ముకున్నారని ఇసుక, గంజాయి, గుట్కా, అక్రమ రేషన్ బియ్యంతో వేల కోట్లు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దోచుకున్నారన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న నరసరావుపేటలో ఎమ్మెల్యే భూధందా పై కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని భూ అక్రమ దారుల పై కొరడా జులిపించి దారిద్రరేఖ దిగువనున్న పేదలకు ప్రభుత్వ భూములు పంచాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ కడియం కోటి సుబ్బారావు పాల్గొన్నారు.

Related posts

సామాజిక దూరం పాటించని బ్యాంకు ఖాతాదారులు

Satyam NEWS

హిందీ టీచర్ నజీరుద్దీన్ సేవలు అభినందనీయం

Satyam NEWS

కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి

mamatha

Leave a Comment

error: Content is protected !!