30.2 C
Hyderabad
May 13, 2024 14: 24 PM
Slider గుంటూరు

ఎన్నికల్లో ఈవీఎంలు రద్దుకు బిల్లు తీసుకురావాలి

#navataramparty

ఓటుకు ఆధార్ అనుసంధానం చేసే బిల్లు ఆమోదించడం మంచిదే అని, అదేమాదిరిగా ఈవీఎంలు రద్దు చేయాలని బిల్లుపెట్టాలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. బ్యాలెట్ పద్ధతిలో భారతదేశంలో భవిష్యత్ ఎన్నికలు జరపాలని అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట లోని నవతరం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో రాష్ట్రవ్యాప్తంగా అన్నీ కలెక్టర్ కార్యాలయాల ముందు ఓటుకు ఆధార్ అనుసంధానం చేయాలని, ఈవీఎంలు రద్దు చేయాలని వాటి స్థానంలో బ్యాలెట్ పద్ధతి ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని నవతరంపార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన విషయం గుర్తు చేసారు. కేంద్ర ప్రభుత్వం ఈవీఎంలు రద్దు బిల్లు తేవాలని, భారత ఎన్నికల కమిషన్ కు ఈవీఎంలు రద్దుకు సిఫార్సు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు ఈవీఎంలు రద్దుకు ఉద్యమిస్తామని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు.

Related posts

ఏ కుల సంఘానికి ఏ అవసరం వచ్చినా తీరుస్తా: ఎమ్మెల్యే కాటిపల్లి

Satyam NEWS

ఏపి నూతన సీఎస్ గా సమీర్ శర్మ

Satyam NEWS

దళిత బంధు అందరికి ఇవ్వకపోతే కేసీఆర్ ఆగ్రహానికి గురికాక తప్పదు

Satyam NEWS

Leave a Comment