చిదంబరం లాంటి మనస్థత్వం ఉన్న వ్యక్తులకు యాంటిసిపేటరి బెయిల్ లాంటి సౌకర్యాలు ఉంటే నిజాలను ఎన్నటికీ చెప్పరని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు విన్నించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు ఎన్ ఫోర్సుమెంటు డైరక్టరేట్ సమాయత్తం కాగా ఈ నెల 26 వరకూ ఆయనను అరెస్టు చేయవద్దుని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చిదంబరం కు 26వ తేదీ వరకూ సిబిఐ కష్టడీ ఉన్నవిషయం తెలిసిందే. 26వ తేదీన సిబిపై కష్టడీ పై వాదనలను, ఈడీ వాదనలను వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో 26వ తేదీ వరకూ ఈడీ చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు అవకాశం ఉండదు. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసు విచారణలో ముఖ్యపాత్ర పోషిస్తున్న రాకేష్ అహూజా ను ఈడీ అకస్మాత్తుగా బదిలీ చేయడం పై పలు అనుమానాలు చెలరేగాయి. ఆయన ప్రస్తుతం ఈడీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. చిదంబరం అరోపణలు ఎదుర్కొంటున్న ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆయన్ని కస్టడీలోకి తీసుకోవడంలో రాకేష్ కీలక పాత్ర పోషించారు. ఈడీ తాజా అనూహ్య నిర్ణయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంత హఠాత్తుగా అహుజాను బదిలీ చేయాల్సిన అవసరమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేసును తొలినుంచి విచారిస్తున్న ఈడీ అధికారి రాకేష్ అహుజాను బదిలీ చేయడం కేసును బలోపేతం చేసేందుకా లేక నీరుగార్చేందుకా అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. ఆయనను ఢిల్లీ పోలీసు విభాగానికి అధికారిగా పంపిస్తున్నట్లు గురువారం అర్థరాత్రి ప్రకటన వెలువడింది. అయితే ఏ ప్రత్యేక కారణం లేదని, ఈడీలో ఆయన పదవి కాలం పూర్తి అయిందని, పూర్తి అయి కూడా రెండు వారాలు అయిందని, అందువల్ల చిదంబరం ను సిబిఐ అరెస్టు చేసిన అనంతరం రాకేష్ అహూజాను మాతృసంస్థకు పంపామని ఈడీ వివరణ ఇచ్చింది.
previous post