38.2 C
Hyderabad
May 5, 2024 22: 38 PM
Slider నిజామాబాద్

ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలి

#ASHA activists

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు ఆశా కార్యకర్తలు శనివారం బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ వర్కర్లకు పారితోషకాలను 18 వేలకు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలన్నారు. వారి డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి.

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశలకు ఇస్తున్న పారితోషకాలను 18 వేలకు పెంచి ఫిక్స్ వేతనం నిర్ణయించాలి, పారితోషకం లేని అదనపు పనులు ఆశలతో చేయించకూడదు, టీబీ డబ్బాలను ఆశలతో మోపించే పనిని రద్దు చేయాలి, టీబీ, లెప్రసీ, కంటి వెలుగు తదితర పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి లెప్రసీ సర్వేలో వస్తున్న

ఇబ్బందులను పరిష్కరించాలి వాలంటీర్లను ఏర్పాటు చేయాలి, ఆశలకు పని భారం తగ్గించి జాబ్ చార్ట్ విడుదల చేయాలి, జూలై 2021 నుండి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి ఏలియర్స్ వెంటనే చెల్లించాలి, కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్స్ నెలకు 1000 చొప్పున పదహారునెల బకాయిలు డబ్బులు వెంటనే చెల్లించాలి,32 రకాల

రిజిస్టర్లను వెంటనే ప్రింట్ చేసి ప్రభుత్వం సప్లై చేయాలి, క్వాలిటీతో కూడిన ఐదు సంవత్సరాల పెండింగ్ యూనిఫామ్స్ వెంటనే ఇవ్వాలి, ఆశలకు ప్రసూతి సెలవుల పైన సర్కులర్ ను వెంటనే జారీ చేయాలన్నారు. కార్యక్రమంలో మండల ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

జి లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

సమ్మెకు మిశ్రమ స్పందన

Sub Editor 2

భూసేకరణ ప్రక్రియలో అన్ని జాగ్రత్తలు పాటిoచాలి

Murali Krishna

పేలిన నాటు తుపాకి.. వేటగాడు మృతి

Satyam NEWS

Leave a Comment