32.2 C
Hyderabad
May 2, 2024 02: 06 AM
Slider సంపాదకీయం

సీ ఓటర్‌ సర్వే ఎఫెక్ట్‌: డీలా పడిపోయిన వైసీపీ

#YS Jagan mohan

ఇండియా టుడే సర్వే వైసీపీ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి 15కిపైగా ఎంపీ సీట్లు వస్తాయంటూ ఇండియా టుడే చెప్పిన వార్త వైసీపీ వర్గాల్లో బాంబులా పేలింది. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని తెలిసినా.. ఈ స్థాయిలో టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని ఊహించలేదంటున్నారు ఆ పార్టీ నాయకులు. ఏడాది క్రితం ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ సర్వేలో తెలుగుదేశం కేవలం 7 ఎంపీ స్థానాల్లోనే విజయం సాధించే అవకాశం ఉందని చెప్పగా..

సంవత్సరం తిరిగే సరికి రెట్టింపు స్థానాలకు పైగా గెలిచే స్థాయికి టీడీపీ జనాదరణ పెరిగిందని అదే సర్వే స్పష్టం చేసింది. రోజు రోజుకీ పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు రాష్ట్రంలో చంద్రబాబు ప్రజాపోరాటం, లోకేష్‌ యువగళం పాదయాత్రతో ఆకర్షితులైన ప్రజలు సైకిల్‌తో సవారీకి ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజల్లో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీ అగ్ర నాయకత్వంలో గుబులు రేపుతోంది.

రోజు రోజుకీ టీడీపీ బలం పెంచుకుంటూ పోతుండటం, వైసీపీ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సమయం గడిచే కొద్దీ టీడీపీ మరింత బలపడే అవకాశం ఉందని వైసీపీ వ్యూహకర్తలు ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. టిడిపి మరింతగా జనాల్లోకి వెళ్లేలోపు.. ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మేలని వైసీపీ ముఖ్య సలహాదారులు, జగన్‌కు సూచించారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతోంది. రాష్ట్రానికి కొత్త అప్పులు పుట్టడం గగనమైపోయిన విషయాన్ని రోజూ మీడియాలో వింటున్నాం. ఇప్పటికే ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థతుల్లో, సంక్షేమ పథకాలకూ కేటాయింపులు చేయలేని రోజు రావొచ్చనే ఆందోళనలో మంత్రులు, అధికారులు ఉన్నారని ఆర్ధిక నిపుణలు వివరిస్తున్నారు.

ఒకవైపు దిగజారుతున్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, మరోవైపు తిరుగులేని ప్రజాదరణతో బలం పుంజుకుంటున్న ప్రతిపక్షం.. వైసీపీ అధినాయకత్వాన్ని ముందస్తు ఎన్నికల దిశగా పుష్‌ చేస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఇండియా టుడే సర్వే ప్రకారం టిడిపి సింగిల్‌గానే మెజారిటీ సాధిస్తుందని వస్తున్న వార్తలకు తోడు.. జనసేనతో పొత్తు కుదిరితే, తెలుగుదేశం కూటమిని ఎదుర్కొని నిలబడే అవకశమే లేదనే అభిప్రాయం వైసీపీ నాయకుల నుంచే వినిపిస్తోంది.

నెలకి అయిదు సీట్ల చొప్పున ఈ ఏడాది మార్చి నుండి వైసీపీకి గండి పడుతోందని ఇటీవల ఓ సర్వే తేల్చి చెప్పిందట. ఆ సర్వే రిపోర్ట్‌ జగన్‌ టీమ్‌కి కూడా చేరిందని తెలుస్తోంది.ఇటు, టీడీపీ – జనసేన సైతం జగన్‌పై ఎటాక్‌ పెంచాయి.. అంశాల వారీగా ఎదురుదాడి చేస్తున్నాయి. దీంతో, నాలుగేళ్ల వైసీపీ పాలన చీకటి యుగంగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయనే చర్చ మొదలయింది..

అందుకే, జగన్‌ సైతం సంచలన నిర్ణయం దిశగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని, టీడీపీ – జనసేన నేతలు లెక్కలు కడుతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే తర్వలోనే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో జగన్‌ ఎలాంటి డెసిషన్‌ తీసుకుంటారో మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

Related posts

గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి

Satyam NEWS

రామన్నకు యాంకర్ అనసూయ క్షమాపణ

Satyam NEWS

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌ 296 కోట్లు

Satyam NEWS

Leave a Comment