37.7 C
Hyderabad
May 4, 2024 14: 10 PM
Slider ముఖ్యంశాలు

సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకుపోతా

#Governor Tamilisai

ఆదివాసీల సమస్యలతో పాటు, 5 విలీన పంచాయతీల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకుపోతానని గవర్నర్ తమిలిసై అన్నారు. భద్రాచలం వీరభద్ర పంక్షన్ హాల్ లో ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ తమిళ సై ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఇక్కడి ఆదివాసీ ప్రజల సమస్యలు, ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామ పంచాయతీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు విన్నానని చాలా బాధ పడుతున్నానని చెప్పారు.

అంధ్రలో విలీనమైన 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని కోరిన గిరిజనులకు గవర్నర్ ఇట్టి సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన గవర్నర్ తెలుగులో అందరూ బావున్నారా, అందరూ బావుండాలని సీతారామ చంద్రస్వామిని ప్రార్ధించినట్లు

చెప్పారు. తాను తమిళ ఆడబిడ్డనైనా తెలంగాణ ప్రజలకు అక్కనని ఇక్కడి సమస్యలను అర్దం చేసుకున్నాను అని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా తాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఆదివాసీలు సమస్య పరిష్కార బాధ్యతలు అప్పగించారని, తప్పక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Related posts

ఫ్యాక్ట్-చెక్ పుస్తకం విడుదల చేసిన హైకోర్టు న్యాయమూర్తి

Bhavani

ఎస్సై నుండి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని సాధించిన స్వాతి

Bhavani

మేడ్చల్ ప్రజలు ఉచిత మంచినీటికి అర్హులు కాదా?

Satyam NEWS

Leave a Comment