39.2 C
Hyderabad
May 3, 2024 14: 54 PM
Slider రంగారెడ్డి

మేడ్చల్ ప్రజలు ఉచిత మంచినీటికి అర్హులు కాదా?

#enugusudarsanreddy

మేడ్చల్ నియోజకవర్గం ప్రజలు ఉచిత మంచినీటి సరఫరాకు అర్హులు కారా అని రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. మేడ్చల్ జిల్లా ప్రజలకు నీటి సమస్య విషయంలో నేడు ఆయన హైదరాబాద్ మెట్రో నీటిపారుదల శాఖ ఎండి దాన కిషోర్ కి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జిహెచ్ఎంసి పరిధిలో ఉచిత నీరును అందజేస్తుందని మేడ్చల్ నియోజకవర్గం లో ఉన్న మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు రింగ్ రోడ్డు  లోపల ఉన్న గ్రామాలకు ఉచితంగా నీరు ఇవ్వకుండా ప్రతి ఇంటికి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు.

జిహెచ్ఎంసి పరిధిలో ఎలాగైతే ఉచితంగా నీరు అందచేస్తున్నారో అదే విధంగా మేడ్చల్ కూడా ఇవ్వాలన్నారు. మంత్రి మల్లారెడ్డి  నియోజకవర్గ ప్రజల కోసం నిధులను మరి అభివృద్ధి పనులను ఎలాగో చేయడం లేదు కనీసం మంచినీరు కూడా ఇవ్వడం లేదని ప్రజలను మభ్యపెట్టి కాలయాపన చేస్తున్నారని అన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని  చేస్తున్నారని ఆయన అన్నారు. తనకు నియోజకవర్గ ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే  అభివృద్ధి చేయాలని అనిపిస్తే, జిల్లాలో ఉన్న మండలాలకు,మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఉచితంగా నీరు అందజేయాలని కోరారు  ఈ కార్యక్రమంలో దామోదర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి,హరివర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

బత్యాల తో చమర్తి జగన్మోహన్ రాజు భేటీ

Satyam NEWS

నీట మునిగి ఆరుగురి దుర్మ‌ర‌ణం

Sub Editor

Professional Is Hemp Oil Different Than Cbd Oil Hemp Cbd Oil 7 Cinnamon

Bhavani

Leave a Comment