29.7 C
Hyderabad
May 3, 2024 03: 07 AM
Slider విజయనగరం

గంట వ్యవధిలో కన్నకొడుకును అప్పగించిన ట్రాఫిక్ పోలీస్…!

#traffic police

కని.. పెంచిన కన్న కొడుకు కనిపించకపోతే…ఏ కన్నవారైనా తల్లడిల్లపోతారు…అల్లాడిపోతారు.విజయనగరం లో ఒరిస్సా కు చెందిన… కన్నవారి… కొడుకు తప్పిపోవడం…వాళ్లు… ఆందోళనతో నగరం మొత్తం కలియతిరగడం…పోలీసులను ఆశ్రయించడం…సీన్ కట్ చేస్తే..ట్రాఫిక్ పోలీసులు… ఆ ఎనిమిదేళ్ల బాబు ను…కన్నవారి చెంతకు చేర్చారు.

వివరాల్లోకి కెళితే…ఒరిస్సా… రాష్ట్రం కోరాపుట్ కు చెందిన… అమ్మ ,నాన్న… ఎనిమిదేళ్ల కొడుకు… బస్సు లో విశాఖ వెళుతూ…విజయనగరం కలెక్టరేట్ వద్ద…నిద్ర మత్తులో ఆ బాబు దిగిపోయాడు. బస్సు లో కన్న కొడుకు దిగిపోవడాన్ని గమనించని కన్నవాళ్లు..విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ కు చేరగా… బస్సు లో ఎనిమిదేళ్ల కొడుకు కనిపించకపోవడంతో..

ఆందోళన తో…కాంప్లెక్స్ లో కానిస్టేబుల్ ద్వారా వన్ టౌన్ పోలీసులు ఆశ్రయించారు. ఇదిలా ఉంటే… కలెక్టరేట్ వద్ద నిద్ర మత్తులో బస్సు నుంచీ దిగిపోయిన 8 ఏళ్ల బాబు,..బిక్క చూపు లు చూస్తూ..ఎవరికోసమౌ చూస్తున్నట్లు అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజు..చూసి…వివరాలు సేకరించి…. కన్నవారి చెంత నుంచీ తప్పి పోయాడని గ్రహించారు.

అప్పటికే… మ్యాన్ ప్యాక్ ద్వారా… వన్ టౌన్ నుంచీ పిల్లాడి అమ్మ ,నాన్న లు…కన్న కొడుకు కోసం వెతుకుతుండటం..అంతలోనే ట్రాక్టర్ ఎస్ఐ రాజు..ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి.. చైల్డ్ వెల్ఫేర్ శాఖా ను సంప్రదించి..బాబు ను వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. వన్ టౌన్ స్టేషన్ లో కన్న కొడుకు ను చూసిన కన్నవాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ట్రాఫిక్ పోలీసులకు…చైల్డ్ వెల్ఫేర్ శాఖకు ధన్యవాదాలు చెప్పారు… బాబు కన్నవాళ్లు. ఎట్టకేలకు… దాదాపు గంటన్నర పాటు…. ఎనిమిదేళ్ల బాబు తప్పిపోయిన ఘటన…కన్నవారి చెంతకు చేరడంతో సుఖాంతం అయ్యింది. ఈ గంటన్నర వ్యవధిలో.. కన్నవారు పడిన బాధను… అనంతరం కన్న బిడ్డను అప్పగించిన ట్రాఫిక్ ఎస్ఐ రాజు..ట్రాఫిక్ పీసీ… చేసిన పనికి ఏం రుణం ఇచ్చి తీర్చుకో గలరు.అందుకు “సత్యం న్యూస్. నెట్”..ట్రాఫిక్ పోలీసులకు హ్యేట్సాఫ్ చెబుతోంది.

Related posts

యువకుడు మృతి

Murali Krishna

మరో క్షిపణి ప్రయోగించిన ఉత్తర కొరియా

Satyam NEWS

విజయసాయి యత్నాలపై భగ్గుమంటున్న కాపులు

Satyam NEWS

Leave a Comment